Tuesday, May 5, 2026
HomeNewsరంప యర్రంపాలెం అగ్ని ప్రమాద బాధితులకు కంబాల చేయూత

రంప యర్రంపాలెం అగ్ని ప్రమాద బాధితులకు కంబాల చేయూత

గోకవరం మండలం రంప యర్రంపాలెం గ్రామంలోని భవాని నగర్ శివారులో కుంజాల రఘుపతి, కుటేటి దుర్గాలకు చెందిన రెండు తాటకిల్లు సోమవారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల కాలిపోయాయి. బాధితులు కట్టు బట్టలతో వీధిన పట్టారు. ఈ విషయాన్ని కంబాల యువసేన అధ్యక్షులు, ఉంగరాల మణిరత్నం విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు దృష్టికి తీసుకురాగా ఆయన అందుబాటులో లేనప్పటికీ ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రెండు కుటుంబాలకు 15,000 రూపాయలు నగదు, 50 కిలోల బియాన్ని ప్రకటించారు. వాటిని రామసేన సభ్యులు బీజేపీ నాయకులు బాధితుల వద్దకు వెళ్లి వారికి అందజేసి, వారిని పరామర్శించి, ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. కంబాల శ్రీనివాసరావు బాధితులను వీడియో కాల్ ద్వారా పరామర్శించి, ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, అన్ని విధాలా ఆదుకుంటామని, ప్రభుత్వ పరంగా రావాల్సిన రాయితీలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని, వారికి మనోధైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు బత్తుల నానాజీ, నెల్లి శ్రీను, తుమ్మల బుజ్జి, పదిలం చక్రారావు, కాళ్ళ బుజ్జి, గంటా రాధాకృష్ణ, మండే గౌతమ్, అంబటి శ్రీను, పోతుల కుమారి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments