Wednesday, April 22, 2026
HomeNewsఉత్తమ మార్గదర్శి అవార్డు అందుకున్న

ఉత్తమ మార్గదర్శి అవార్డు అందుకున్న

PSPK ట్రస్ట్ అడ్మిన్ కురుజు ప్రసాద్.

అల్లూరి జిల్లా పాడేరు నియోజకవర్గంలో పి4 జీరో పావర్టీ కార్యక్రమం విజయవంతంగా ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో సమాజ సేవలో విశేష కృషి చేసిన PSPK ట్రస్ట్ అడ్మిన్ శ్రీ కురుజు ప్రసాద్ కి ఉత్తమ మార్గదర్శి పురస్కారం అందుకున్నారు.
ఈ అవార్డును జిల్లా ఇంచార్జ్ మంత్రి మరియు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఘనంగా అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమం పేదరిక నిర్మూలన లక్ష్యంగా రూపొందించబడిన పి4 పబ్లిక్, ప్రైవేట్ ,పీపుల్స్ , పార్ట్నర్షిప్, మోడల్‌లో భాగంగా నిర్వహించబడింది. ఈ పథకం ద్వారా ఆర్థికంగా బలమైన వ్యక్తులు, వెనుకబడిన కుటుంబాలకు మార్గదర్శకులుగా మారి వారి అభివృద్ధికి తోడ్పడుతున్నారు.
కురుజు ప్రసాద్ PSPK ట్రస్ట్ ద్వారా పాడేరు నియోజకవర్గంలోని పలు గ్రామాలలో పేద కుటుంబాలను దత్తత తీసుకుని, వారికి ఆర్థిక సహాయం, ఉపాధి అవకాశాలు, విద్య మరియు ఆరోగ్య సేవలను అందిస్తూ సమాజంలో ఒక ఆదర్శంగా నిలిచారు. ఆయన సేవలు పి4 కార్యక్రమానికి విశేష ప్రోత్సాహాన్ని అందించాయి.
ఈ సందర్భంగా పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ, కురుజు ప్రసాద్ గారి సేవలను అభినందిస్తూ, యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
ఈ అవార్డు, ఆయన చేసిన సామాజిక సేవలకు ఒక గుర్తింపుగా మాత్రమే కాకుండా, మరింత సేవ చేయడానికి ప్రేరణగా నిలుస్తుందని ఆయన తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments