Wednesday, April 22, 2026
HomeNewsబ్యాడ్మింటన్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు

బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు

జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ (జే సి ఐ) వైజాగ్ ఆధ్వర్యంలో మధురవాడ బ్యాడ్మింటన్ పార్క్ లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహించారు. మహిళలు, పురుషులు డబుల్స్ విభాగాలుగా జరిగిన ఈ టోర్నమెంట్లో 40 టీంలు పాల్గొన్నారు. పురుషుల డబుల్స్ విభాగంలో కే.ఎల్. అభిరామ్, మణికంఠ టీం విజేతగా నిలిచింది. లలియా, బి. చంద్రశేఖర్ టీం రన్నర్స్ గా నిలిచారు. మహిళలు డబుల్స్ విభాగంలో సుచితేశ్వరి, హరిత టీం విజయం సాధించగా, డి. కళ్యాణి, ఎం. మానస టీం రన్నర్స్ గా నిలిచారు. జెసిఐ వైజాగ్ ప్రెసిడెంట్ రవీంద్ర, సెక్రటరీ గాయత్రి, ట్రెజరర్ సాయిచరణ్, టోర్నమెంట్ ప్రాజెక్ట్ చైర్పర్సన్ మౌలి జోయల్, కోఆర్డినేటర్ దిలీప్ కుమార్, వి రమేష్ తదితరులు పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments