– టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసచారిని సత్కరిస్తున్న మగ ఆరోగ్య కార్యకర్తలు
విశాఖపట్నం, ఫిబ్రవరి 17, జయ జయ హే:
వైద్య ఆరోగ్యశాఖలో మగ ఆరోగ్య కార్యకర్తలను రాష్ట్ర ప్రభుత్వ తిరిగి పునర్ నియామకం చేయడంలో టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. శ్రీనివాసచారి చేసిన కృషి హార్షణీయమని ఆరోగ్య కార్యకర్తలు పేర్కొన్నారు. ఈసందర్భంగా మద్దిలపాలెం సబ్ యూనిట్ కార్యాలయంలో మంగళవారం పునర్ నియామకం అయిన ఆరోగ్య కార్యకర్తలు ఆయనను ఘనంగా సత్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పునర్ నియామాకానికి రాష్ట్ర ప్రభుత్వ తీసుకున్న నిర్ణయం వలన ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 730 మంది తిరిగి విధులోకి చేరారన్నారు. వీరందరికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అని రాయితీల వచ్చేలా కృషి చేస్తానన్నారు. వీరికి 100శాతం జీతాలు వచ్చేలా చర్యలు తీసుకోనున్నామన్నారు. నిబంధల మేరకు 100 పర్సంటేజ్ సాలరీకి వీరందరూ అర్హులన్నారు. విధులో నిబద్దతతో పనిచేసి ప్రజలకు సేవలందించాలని ఆయన కోరారు. ఈకార్యక్రమంలో సబ్ యూనిట్ అధికారి నగేష్ పట్నాయిక్, శేషుబాబులను శాలువ కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్ఈవో బండారు శ్రీనివాసరావు, సూపర్ వైజర్లు, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.
