Wednesday, April 22, 2026
HomeNewsఓవర్ లోడింగ్ వాహనాలపై రాంబిల్లి పోలీసుల కొరడా.. భారీ జరిమానా విధింపు

ఓవర్ లోడింగ్ వాహనాలపై రాంబిల్లి పోలీసుల కొరడా.. భారీ జరిమానా విధింపు

యలమంచిలి, జయ జయహే న్యూస్ : రాంబిల్లి మండలంలో బుధవారం ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా రాంబిల్లి పోలీసులు, మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ కోడి వాసు సంయుక్తంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నియమాలకు విరుద్ధంగా ఓవర్‌లోడింగ్ చేసిన నాలుగు వాహనాలను గుర్తించి, సంబంధిత వాహనాలపై చర్యలు తీసుకున్నారు. తనిఖీల్లో పట్టుబడిన వాహనాలపై మొత్తం రూ. 2,85,180/- జరిమానాలు విధించినట్లు పోలీసులు తెలిపారు. వాహన దారులు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments