Wednesday, February 11, 2026
HomeNewsధర్మవరంలో సరస్వతి దేవి విగ్రహావిష్కరణ

ధర్మవరంలో సరస్వతి దేవి విగ్రహావిష్కరణ

యలమంచిలి, జయ జయహే న్యూస్ : పట్టణంలోని ధర్మవరం శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో బుధవారం సరస్వతి దేవి విగ్రహావిష్కరణ ఘనంగా నిర్వహించారు. డిగ్రీ కళాశాలతో పాటు జూనియర్ కళాశాల, క్రీడా ప్రాంగణం కోర్టు తదితర భవనాలు కూడా ఇదే ప్రాంతంలో ఉండడంవల్ల నిత్యం విద్యార్థులు, విద్యావంతులు ఉండడంతో సరస్వతి మాత విగ్రహాన్ని ప్రతిష్టించాలని స్థానికులు కోరడంతో ఈ విగ్రహ ప్రతిష్టను ఘనంగా నిర్వహించినట్టు ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ కొట్టారు సాంబశివరావు, కొటారు నరేష్, తాటిపాకల మాణిక్యాలరావు, కొసిరెడ్డి నాగు, అల్లారపు గోవిందు, చలం శెట్టి, శ్రీను వజ్రపు నాగేశ్వరరావు, పుల్లా నాని తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments