Wednesday, April 22, 2026
HomeUncategorizedఅబుదాబి ఓపెన్ మాస్టర్ గేమ్స్ లో రాజమహేంద్రవరం క్రీడాకారుడి ప్రతిభ

అబుదాబి ఓపెన్ మాస్టర్ గేమ్స్ లో రాజమహేంద్రవరం క్రీడాకారుడి ప్రతిభ

– టెన్నిస్ సింగిల్స్ డబల్ మరియు మిక్స్ డబుల్స్ ఈవెంట్స్ లో 3 మెడల్స్ సాధన
అబుదబిలో ఈ నెల 6 నుంచి 15వ తేదీ వరకూ ఘనంగా నిర్వహించిన 2026 “ఓపెన్ మాస్టర్ గేమ్స్” టెన్నిస్ పోటీల్లో రాజమహేంద్రవరానికి చెందిన క్రీడాకారుడు, ముదునూరి సత్య రాజ ఇంద్ర రాజు, అంతర్జాతీయ వేదికపై తన ప్రతిభను చాటుతూ విశేష విజయాలను నమోదు చేశారు. ఈ అంతర్జాతీయ టోర్నమెంట్ లో భారతదేశం తరపున మెన్స్40 ప్లస్ సింగిల్స్, డబుల్స్ మరియు మిక్స్డ్ డబుల్స్ టెన్నిస్ ఈవెంట్లలో పాల్గొన్న ఇంద్రరాజు 3 బ్రాంజ్ మెడల్స్ సాధించారు. ఈ విజయ ఆనందాన్ని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌తో పంచుకోగా మూడు బ్రాంజ్ మెడల్స్ సాధించిన ఆయన్ను అభినందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ 52 దేశాల నుంచి 500 మంది పైగా క్రీడాకారులు పాల్గొన్న ఈ టెన్నిస్ ఈవెంట్‌లో మన ప్రాంతీయ ఆటగాడు దేశానికి గౌరవం తెచ్చేలా పతకాలు సాధించడం అభినందనీయమన్నారు. సత్య రాజ ఇంద్రరాజు మాట్లాడుతూ గ్లోబల్ సీనియర్ టెన్నిస్ అసోసియేషన్ ద్వారా ఆల్ ఇండియా ర్యాంకింగ్ టోర్నీల్లో పాల్గొంటూ విజయాలు సాధించి ర్యాంకింగ్ పాయింట్లు సేకరించి అబుదాబి ఈవెంట్‌కు భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించే అర్హత పొందడం జరిగిందన్నారు. తాను ఈ పతకాలు సాధించేందుకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రోత్సాహం ఎంతో ఉందన్నారు. ఇది కేవలం విజయం కాదు… మూడేళ్ల తన పోరాటమన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు టెన్నిస్ స్పోర్టుకు ప్రోత్సాహం ఇస్తూ, క్రీడలకు రాజమహేంద్రవరంలో అద్భుతమైన మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు కల్పించడం జరుగుతోందన్నారు. విజనరీ నాయకత్వం దొరకడం రాజమహేంద్రవారం పౌరులకు మంచి అవకాశమని కొనియాడారు. ఈయన స్ఫూర్తి… ప్రోత్సాహం తరతరాలకు ప్రేరణగా నిలుస్తుందన్నారు. తన ఈ విజయం రాజమహేంద్రవారం యువతను క్రీడల పరంగా ముందుకు సాగేలా ప్రేరేపిస్తుందని ఇంద్రరాజు ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌…. ఇంద్రరాజును ప్రశంసిస్తూ భవిష్యత్తులో మరిన్ని జాతీయ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని మరిన్ని శిఖరాలను అధిరోహిస్తూ దేశానికి మరిన్ని పథకాలను తీసుకురావాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments