Monday, May 25, 2026
HomeNewsఉధారస్వభావానికి నిలువెత్తు నిదర్శనం పివిజి రాజు

ఉధారస్వభావానికి నిలువెత్తు నిదర్శనం పివిజి రాజు

ఉధారస్వభావానికి నిలువెత్తు నిదర్శనం పివిజి రాజు…!

టిడిపి రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు

 

భీమిలి జయ జయహే: పూసపాటి విజయరామ గజపతిరాజు విజయనగరం సంస్థానానికి చివరి మహారాజుగా, ఒక పార్లమెంటేరియన్ గా, ప్రజా సేవకుడిగా, దాతగా ప్రజల గుండెల్లో సుస్థిరమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఆదర్స్ హిందీ ప్రేమిమండలి గౌరవ అధ్యక్షులు గంటా నూకరాజు అన్నారు. పివిజి రాజు 30వ వర్ధంతి సందర్బంగా భీమిలి శాఖ ఆదర్స్ హిందీ ప్రేమిమండలి అధ్యక్షులు కె.ఎస్.ఆర్. కృష్ణారావు మాస్టర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి గంటా నూకరాజు ముఖ్య అతిధిగా విచ్చేశారు. భీమిలి పాత బస్టాండ్ వద్ద ఉన్న పివిజి రాజు నిలువెత్తు విగ్రహానికి గంటా నూకరాజు, కృష్ణారావు మాస్టర్ సంయుక్తంగా పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం మాట్లాడుతూ ప్రజా సేవకు, ధాత్రుత్వానికి ఆదర్శప్రాయంగా విజయనగరం సంస్థానాదీశులు ప్రధమ స్థానంలో ఉంటారని అన్నారు. అలాంటి వంశంలో పుట్టి పెరిగిన పివిజి రాజు విజయనగరం సంస్థానానికి 15వ మరియు చివరి మహారాజుగా సేవలు అందించారని అన్నారు. అలాగే విద్య, సామాజిక సంస్కరణలు మరియు ప్రజలకు సేవలు చేయడంలో కీలకపాత్ర పోషించారని అన్నారు. విజయనగరం పార్లమెంట్ సభ్యునిగా 3 సార్లు ప్రజలచేత ఎన్నుకోబడ్డారని అన్నారు. భీమిలి నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా గెలిచి విద్యాశాఖ మంత్రిగా విశిష్ట సేవలు అందించారని అన్నారు. అంతేకాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న 113 దేవాలయాలకు ధర్మకర్తగా ఉన్నారని అన్నారు. ప్రస్తుతం విశాఖలో ఉన్న విద్యా మందిర్ ఆంధ్ర యూనివర్సిటీకి 600 ఎకరాలు, విజయనగరంలో ఉన్న కోరుకొండ సైనిక్ స్కూల్ కి 1100 ఎకరాలు దారాదత్తం చేశారని అన్నారు. ఎన్నో పుణ్య క్షేత్రాల రూపకల్పన, విద్యాలయాల నిర్మాణం పివిజి రాజు ఆధ్వర్యంలో జరిగాయని గంటా నూకరాజు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని, విద్యార్డులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments