ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీలో అచ్చెన్న
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా గ్రామస్థాయిలో ప్రజల వద్దకే అభివృద్ధి కార్యక్రమాలు చేరేలా కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చం నాయుడు స్పష్టం చేశారు.
టెక్కలి నియోజకవర్గం పరిధి గ్రామాల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ను ఆయన స్వయంగా పంపిణీ చేశారు, గ్రామీణ ప్రజలు ఆనందంగా ఆరోగ్యంగా ఉండటమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు, ప్రజలు, ప్రజా ప్రతినిధులు, సమన్వయంతో సమిష్టి కృషికి ప్రభుత్వం ముందంజలో ఉందని ఆయన అన్నారు, ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామస్తులు, ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
