Sunday, June 14, 2026
HomePoliticsAndhra Pradeshప్రజా మరుగుదొడ్డి నిర్మించాలి

ప్రజా మరుగుదొడ్డి నిర్మించాలి

జీవీఎంసీ కమిషనర్ కు బలిరెడ్డి వినతి
పి జి ఆర్ ఎస్ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ని ఏ డి సి చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ కలిసి జీవీఎంసీ 79, 85 వార్డులకు అనుసంధానంగా అగనంపూడి జాతీయ రహదారి రోడ్డు ఇరుప్రక్కల సుమారు 120 షాపులు ఉన్నాయి అందులో పని చేసే పురుషులు ముఖ్యంగా మహిళలు స్థానికంగా ప్రజా మరుగుదొడ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా బ్యాంకులు, ఏరియా ఆసుపత్రి, ఆధార్ సెంటర్, బుధవారం సంతా, ప్రయాణికులకు సౌలభ్యం గా అగనంపూడి బస్ స్టాప్ పక్కన ప్రజా మరుగుదొడ్డి తక్షణమే నిర్మించాలని, అగనంపూడి స్మశాన వాటికలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి, కేర్ టేకర్ నియమించాలని , అగనంపూడి సిగ్నల్ నుండి దువ్వాడ రైల్వే స్టేషన్ వరకు విద్యుత్ దీపాలు వెయ్యాలని, జీవీఎంసీ 84 వ వార్డు కొప్పాక ఆ పరిసర నివాసకులు వాడే మురికి నీరు, టాయిలెట్స్ ఏలేరు కెనాల్ మంచినీటితో కలిసి మంచినీరు కలుషితం అవుతుందని, ఇటీవల కొప్పాక నుండి సిరిసిపిల్లి వరకు సీసీ కాలువ నిర్మాణం కు 2 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేశారని ఆ కాలువ మురికి నీరు పోవుటకు అవుట్లెట్ ఏలేరు కాలువలోకి ఇవ్వడం తో ఆ నీరు కలుషితం అవుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారని కావున అవుట్లెట్ ఏలేరు కాలు అవతల పాత చెరువులోకి పోయే విధంగా ప్రతిపాదన చేసిన తర్వాత కాలువ పనులు ప్రారంభించాలని వినతి పత్రం అందజేయడం జరిగింది. ఆగనంపూడి ఉక్కు నిర్వాసితుల నాయకుడు దాసరి ఈశ్వరరావు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments