Home Editorials 18 వ రోజు కి చేరిన నిరసన దీక్షలు

18 వ రోజు కి చేరిన నిరసన దీక్షలు

0

గోవాడ సుగర్ ఫ్యాక్టరీ వద్ద ఫ్యాక్టరీ క్రషింగ్ ప్రారంభించాలని, చెరుకు రైతులకు,కార్మికులకు పెండింగ్ బకాయిలు చెల్లించాలని రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, అఖిలపక్ష పార్టీలు చేస్తున్న నిరసన దీక్షలు సోమవారం నాటికి 18 వ రోజుకు చేరుకున్నాయి.ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు మాట్లాడుతూ రైతులు పండించిన చెరుకు పంట కి గిట్టుబాటు ధర కల్పించాలని, షుగర్ ఫ్యాక్టరీ చెరుకు క్రషింగ్ ప్రారంభించాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రభుత్వం రైతులు పట్ల చిన్న చూపు చూస్తుంది, రైతులు కోపం కట్టలు తెంచుకున్న పోతే ముఖ్య మంత్రి కి తగిన మూల్యం చెల్లిస్తారన్నారు.రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి కోన మోహన్ రావు మాట్లాడుతూ రైతులు కి సుమారు 35కోట్లు రూపాయల బకాయిలు ఉన్నా నాటికి 18రోజులు నుండి నిరసన కార్యక్రమం జరుగుతున్న చోడవరం ఎమ్మెల్యే ఫ్యాక్టరీ పై ఎటువంటి స్పందన లేదని అన్నారు.కార్మిక సంఘం యూనియన్ నాయకులు శరగడంరామునాయుడుకార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ కార్మికులు బకాయిల్లు చెల్లించాలని మరియు రిటైర్మెంట్ కార్మికులు కి గ్రాడ్యుయేట్ చెల్లించాలని డిమాండ్ చేస్తున్న
మేనేజ్ మెంట్ స్పందించి కుండా ఉందన్నారు . రైతు సంఘం అధ్యక్షుడు వేచలపు వెంకటరమణ మాట్లాడుతూ, ఫ్యాక్టరీ సమస్యలపై రైతులు, కార్మికులు చేస్తున్న పోరాటం 18 రోజులుగా,పండుగ పూట కూడా పస్తులతో కొనసాగుతున్నా, చోడవరం , మాడుగుల నియోజకవర్గాల శాసన సభ్యులుగాని, అనకాపల్లి ఎంపీ,జిల్లా మంత్రులు గాని కనీసం స్పందించకపోవడం కూడా దారుణమైన విషయమన్నారు.రైతు సంఘం ఉప అధ్యక్షుడు ఎస్ వి. నాయుడు మాట్లాడతూ, ఫ్యాక్టరీకి నష్టాలు,అప్పులు పాలకవర్గాలు, రాజకీయ నాయకులే మిగిల్చారన్నారు. నేడు నష్టాలు వచ్చాయని చెప్పి,ఫ్యాక్టరీ స్థాపించిన నాటినుండి దాని అభివృద్ధికి అహోరాత్రులు కష్టపడిన రైతులను, కార్మికుల్ని నేడు బకాయిలు చెల్లించకుండా రోడ్డున పడేసారని, కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చలన్నారు. ఇంకా ఈ కార్యక్రమల్లో నాగిరెడ్డి సత్యనారాయణ రైతులు లెక్కల శీనువాసురావు, సబ్బవరపు రామనాయుడు, గేదెల సన్యాసినాయుడు, సేనాపతి సత్య రావు. రాయి సూరిబాబు, కసిపల్లి సత్యనారాయణ, కడితశివశంకర్,మడక మహాలక్ష్మి నాయుడు, మానేపల్లి వెంకట్ రమణ, సూరిశెట్టి కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version