Home News నౌపడ రైల్వే స్టేషన్ కు న్యాయం చేయాలి

నౌపడ రైల్వే స్టేషన్ కు న్యాయం చేయాలి

0

అతి పాతకాలము 1893 నుంచి ఈశాన్యం దక్షిణ పశ్చిమ ప్రాంతాల ప్రయాణికుల కు సేవలు అందిస్తున్న నౌపడ రైల్వే స్టేషన్ లో అన్ని రకాల రైల్వే ఎక్స్ప్రెస్ లు నిలుపు చేసి ఈ ప్రాంత సుదీర్ఘ కాలo నుంచి ఆశిస్తున్న సమస్యలను పాలకులు పరిష్కార మార్గాలను కార్యాచరణ కు ముందడుగు వేయాలని ఈ ప్రాంత ప్రజలు, ప్రజా సంఘాలు, వ్యాపార సంస్థలు,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హృదయపూర్వక చేస్తున్నారు.నౌపడ రైల్వే జంక్షన్ కు అందుబాటులో ఉండే అనువైన జంక్షన్ గా పేరు ఉంది గంజాం జిల్లా, పర్లాకిమిడి, రాయగడ జిల్లా గుణుపూర్, కాశీ నగర్, పాతపట్నం , కొత్తూరు, టెక్కలి, వజ్రపు కొత్తూరు, కోటబొమ్మాలి, సంతబొమ్మాలి, నందిగాం, మండలాలకు, ప్రాంత ప్రజలకు అనువుగా ఉన్న బస్సు సౌకర్యం, ఆటోలు, అందుబాటులో ఉండి రైల్వే స్టేషన్గా ఏళ్ల తరబడి ప్రయాణికులకు సేవలు అందిస్తున్న నౌపడ రైల్వే స్టేషన్ జంక్షన్ లో ఇప్పుడు నిలుపుదల చేస్తున్న రైలు ఎక్స్ప్రెస్ తో పాటు మరిన్ని ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైళ్లు నిలుపు చేసి పాలకులు, ఉన్నతాధికారులు న్యాయం చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.ప్రభుత్వాల ఆదాయానికి అతి దగ్గరలోని జీడి పిక్కల పరిశ్రమ, మత్స్య సంపద రవాణాకు, గ్రానైట్ పరిశ్రమ, అతి త్వరలో ప్రారంభం కానున్న మూలపేట గ్రీన్ పోర్ట్ సర్కుల రవాణా ఆర్థిక ఎదుగుదలకు నౌపడ రైల్వే స్టేషన్ జంక్షన్ ఎంతగానో ఉపకరిస్తుందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. ఈ స్టేషన్ ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి , భవిష్యత్తులో మంచి రైల్వే స్టేషన్ గా రైల్వే శాఖ అధికారులు సుందరీకరణ చేస్తున్నారు , దీనితో పాటు అన్ని ఎక్స్ప్రెస్ రైళ్లు, పాసెంజర్ రైలు, నిలుపు చేసి వే స్టేషన్ భారతీయ రైల్వేలో మంచి ఆర్థిక రైల్వే స్టేషన్గా ఎదగాలని ప్రజల సేవలకు ఎంతగానో ఉపయోగపడాలని ఈ ప్రాంత వాసులు ఆశిస్తున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version