Thursday, April 23, 2026
HomePoliticsAndhra Pradeshవినియోగదారుల హక్కులను పరిరక్షించడం అందరి బాధ్యత

వినియోగదారుల హక్కులను పరిరక్షించడం అందరి బాధ్యత

డాక్టర్ డి.వి.జి. శంకర్రావు

ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం’ సందర్భంగా అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం 42వ డివిజన్ కామాక్షి నగర్, అయ్యన్నపేట మున్సిపల్ వాకింగ్ నడకమైదానంలో వినియోగదారుల హక్కులపై అవగాహన కార్యక్రమాన్ని క్లబ్ అధ్యక్షులు సిహెచ్ రమణ నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రముఖ సాహితీవేత్త ప్రముఖ వైద్యుడు, మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ డివిజి శంకర్రావు మాట్లాడుతూ
ప్రతీఏటా మార్చి 15న నిర్వహించే ఈ దినోత్సవం వినియోగదారుల ప్రాథమిక హక్కులను ప్రోత్సహించడం, వారిని సాధికారత పరచడం మరియు న్యాయమైన, సురక్షితమైన మార్కెట్ల గురించి అవగాహన కల్పించడం ప్రధాన లక్ష్యంగా జరుపుకుంటారని,
ఈ సంవత్సరం థీమ్: ‘సురక్షితమైన ఉత్పత్తులు, నమ్మకంగా ఉన్న వినియోగదారులు’ ఇది భౌతిక మరియు డిజిటల్ మార్కెట్‌లలో ఉత్పత్తుల భద్రతను, ఇ-కామర్స్‌లో విశ్వసనీయతను నొక్కి చెబుతుందని
వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు నాణ్యతను తనిఖీ చేసి, ఖచ్చితంగా రసీదు అడగి తీసుకోవాలని,
అన్యాయమైన వాణిజ్య పద్ధతులు, తక్కువ బరువులు లేదా కల్తీ గమనిస్తే, ‘జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి’ వినియోగదారుల ఫోరమ్‌లలో ఫిర్యాదు చేయాలని,
ఆన్‌లైన్ మోసాల పట్ల ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని, వినియోగదారుల హక్కులను పరిరక్షించడం అందరి బాధ్యతని, మరింత పారదర్శకమైన, సురక్షితమైన ఆర్థిక వ్యవస్థ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతమైన వినియోగదారులుగా మారాలని కోరారు.
కార్యక్రమంలో క్లబ్ గౌరవ అధ్యక్షులు త్యాడ రామకృష్ణారావు(బాలు), డిప్యూటీ గవర్నర్ తాడ్డి ఆదినారాయణ, ఉపాధ్యక్షులు పి. అప్పలరాజు, కార్యదర్శి కోట్ల ఈశ్వరరావు, సహకార్యదర్శి ఐ.అప్పలరాజు జాలివాకర్ నలమహారాజు, క్లబ్ పెద్దలు కోట్ల సత్యనారాయణ, పాత్రుడు, గురుమూర్తి, సిహెచ్ సత్యనారాయణ మాస్టారు, నరేష్ పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments