Wednesday, April 22, 2026
HomeNewsభాష్యంలో ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు

భాష్యంలో ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు

చోడవరం భాష్యం స్కూల్ ప్రాంగణంలో సోమవారం ప్రీ ప్రైమరీ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రముఖ గైనకాలజిస్ట్ డా.ఎస్ ప్రియాంక హాజరయ్యారు
పాఠశాల ప్రిన్సిపాల్ కె. సంతోష్ కుమార్ అధ్యక్షత వహించగా, హెచ్‌ఎం పి. కావ్య కార్యక్రమం నిర్వహించారు. అనేక మంది తల్లిదండ్రులు హాజరై తమ చిన్నారుల ప్రతిభను చూసి ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థులు కన్వొకేషన్ దుస్తుల్లో వేదికపై సర్టిఫికెట్లు స్వీకరించారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పాటలు, నృత్యాలు, వేషధారణ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.ముఖ్య అతిథి డా. ప్రియాంక చిన్నారులకు శుభాకాంక్షలు తెలుపుతూ, విద్యారంగంలో తొలి అడుగు ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రిన్సిపాల్ కె. సంతోష్ కుమార్ మాట్లాడుతూ, పాఠశాల ఎల్లప్పుడూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments