Wednesday, April 22, 2026
HomePoliticsAndhra Pradeshఅభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వానికి రెండు కళ్ళు

అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వానికి రెండు కళ్ళు

అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పాలన సాగిస్తుందని స్థానిక ఎమ్మెల్యే ఎస్ఎంఎస్ రాజు చెప్పారు. సోమవారం ఆయన బుచ్చయ్యపేట మండలం చింతపాక గ్రామంలో నూతనంగా నిర్మించిన తారు రోడ్డు, విద్యుత్ దీపాలు, మినీ గోకులం షెడ్లు ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఇప్పటికే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ముందుకు చదువుతున్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా ఉంటూ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను స్థానికులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో విశాఖ డైరీ డైరెక్టర్ గేదెల సత్యనారాయణ, అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు తమరాన దాసు , మాజీ జెడ్పిటిసి గోకివాడ కోటేశ్వరరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments