Monday, June 15, 2026
HomePoliticsAndhra Pradeshధర్మాన్ని ఆచరించడమంటే దైవాన్ని ఆశ్రయించినట్లే

ధర్మాన్ని ఆచరించడమంటే దైవాన్ని ఆశ్రయించినట్లే

డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, తితిదే

ధర్మాన్ని ఆచరించడమంటే దైవాన్ని ఆశ్రయించినట్లేనని, ధర్మము దైవము వేరుకాదని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లాశాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. తిరుపతి తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో పగిడ్యాల మండలం, పాతముచ్చుమర్రిలోని శ్రీ శాంభవీ సహిత సంగమేశ్వరస్వామి దేవస్థానం నందు గత నాలుగు రోజులుగా జరుగుతున్న ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల ముగింపు సందర్బంగా గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్బంగా వారు భక్తుల నుద్దేశించి ప్రవచించారు. భగవద్గీత ప్రచారకులు వి. నాగేశ్వర రెడ్డి చేసిన ధార్మిక ప్రవచనాలు, స్థానిక భజన మండలిచే భజన కార్యక్రమాలు భక్తులను అలరించాయి. ఈ కార్యక్రమాంలో గ్రామపెద్దలు కాటం వెంకటరామి రెడ్డి, కాటం సుదర్శనమ్మ, అశోక్ బాబు, తలారి నాగన్న, భార్గవ్, గొల్ల నాగభూషణం, కె. బాలనారాయణ,కె. సుబ్బారావు, పి. పరమేశ్వర రెడ్డి,బి. నరేంద్రారెడ్డి, సంగెం శ్రీరాములు, హుసేనమ్మ, బి. సత్యమ్మ, కమ్మరి ప్రమీలమ్మ, పూజారి లక్ష్మయ్యాచారి, అచ్చన్న, అంబటి శివ శంకరరెడ్డితో భజన మండలి సభ్యులతోపాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments