స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉమెన్ ఎంపవర్ కమిటీ, జాతీయ సేవా పథకం వారి నిర్వహణలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి కిరణ్ కుమార్, వుమన్ ఎం పవర్ కమిటీ సమన్వయకర్త డాక్టర్ లక్ష్మీ మంగమ్మ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ప్రతి అమ్మాయి తల్లి తండ్రితో తన చదువుకు సంబంధించిన విషయాలు ప్రతి రోజు కనీసం రెండు నిమిషాలు మాట్లాడిన ఎడల ఈరోజు మనం ఏమి నేర్చుకున్నాము అని మననం చేసుకోవడం వలన సమాజంలో పరిపక్వ స్త్రీగా తయారవుతారని తెలియజేశారు. డబ్ల్యూ ఈ సి సమన్వయకర్త లక్ష్మీ మంగమ్మ మాట్లాడుతూ కళాశాలలో ఆనవాయితీగా వస్తున్న వివిధ గ్రూపుల టాపర్స్ తల్లిదండ్రులను కళాశాలలో సన్మానించుకోవడం స్త్రీ సాధికారత అభివృద్ధి చెందే దిశగా విద్యార్థులు ముందడుగు వేయాలని విన్నవించారు. తృతీయ సంవత్సరం నుండి గాయత్రి, మాధవి, దివ్య, ఏ గాయత్రి, హాని, ద్వితీయ సంవత్సరం నుండి వసంత, వెంకటలక్ష్మి, ప్రవల్లిక, త్రివేణి, రేణుక, తల్లులను ఉమెన్ ఎంపవర్ కమిటీ మరియు కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం వారిని ఘనంగా సన్మానించారు. డాక్టర్ జ్యోతి, డాక్టర్ సంధ్య శ్రీ, సమన్వయకర్త డాక్టర్ నారాయణ మూర్తి, ఈ కార్యక్రమానికి జాతీయ సేవా పథకం ప్రోగ్రామ్ ఆఫీసర్స్ డి.మాల్యాద్రి,కళాశాల సీనియర్ అధ్యాపకులు వి.అప్పలనాయుడు,డాక్టర్ రాధాకృష్ణ, డాక్టర్ మళ్ళీబాబు, డాక్టర్ శ్రీవెంకటేష్,సరస్వతీ, రామలక్ష్మి, కోమల, కామర్స్ శ్రీనివాసరావు, హేమ గణేష్ అధ్యాపక బృందం ఈ కార్యక్రమంలో శాసన పాల్గొన్నారు.
డిగ్రీ కళాశాలలో ” అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు
RELATED ARTICLES
