Sunday, April 19, 2026
HomePoliticsAndhra Pradeshతెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక పొట్టి శ్రీరాములు

తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక పొట్టి శ్రీరాములు

అమరజీవి పొట్టి శ్రీరాములు తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మహానుభావులని మార్నింగ్ కాఫీ క్లబ్ కన్వీనర్ బొండా రాంబాబు, కో కన్వీనర్ ఓలేటి శ్రీనివాస్, కొత్త శ్రీనివాస్, కారుమూరి సత్యనారాయణ,పిఆర్ఓ భట్టిప్రోలు శ్రీనివాసరావు అన్నారు. భీమవరం మార్నింగ్ కాఫీ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. పులవర్తి రామకృష్ణ, గాదె నాగేశ్వరరావు లు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన 58 రోజుల ఆమరణ నిరాహార దీక్ష భారతదేశ చరిత్రలో చిరస్మరణీయమైన ఘట్టమని అన్నారు. కంచర్ల భాస్కరరావు, చవ్వ శ్రీనివాససుబ్బారావు, బొండాడ బంగారాజు మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆత్మగౌరవం, భాషా గౌరవం కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు సేవలను ప్రతి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత మనందరిదన్నారు.అమంచి కృష్ణమోహన్ మాస్టారు మాట్లాడుతూ తెలుగు ప్రజల కోసం పొట్టిశ్రీరాములు అమరణ నిరాహార దీక్షచేసి అమరజీవిగా మారారని, ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసిన పొట్టి శ్రీరాములు పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోతుందన్నారు. కార్యక్రమం లో వబిలిశెట్టి వెంకటేష్, గుండు సుధీర్,బంగారు ప్రసాద్,బొండాడ సుబ్బారావు, జూలూరి రాజా, కారుమూరి బదరి, కొల్లేపర్ల సుబ్బారావు సభ్యులు పాలుగొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments