కార్డెన్ అండ్ సెర్చ్ పేరిట పోలీసుల ఆకస్మిక తనిఖీలు.
తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు, కొవ్వూరు డిఎస్పి జి దేవకుమార్ నేతృత్వంలో నిడదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ పివిజి తిలక్ ఆధ్వర్యంలో నిడదవోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని సమస్యాత్మక మరియు సున్నితమైన ప్రాంతాల్లో పోలీసులు కార్డాన్ సెర్చ్ నిర్వహించారు.
అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడానికి మరియు శాంతిభద్రతలను కాపాడటానికి నిడదవోలు సర్కిల్ పరిధిలోని నాలుగు పోలీస్ స్టేషన్ల ఎస్సైలు, 30 మంది సిబ్బందితో అర్ధరాత్రి వేళ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
పోలీసులు ఒక్కసారిగా చుట్టుమట్టడంతో ఈ ప్రాంత వాసులు అందరు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
ఈ తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు లేని మరియు నంబర్ ప్లేట్లు లేని నాలుగు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
గంజాయి సారా మాదకద్రవ్యాలు వ్యభిచారం కోడిపందాలు పేకాట వంటి అసాంఘిక కార్యక్రమాలకు
గంజాయి, అక్రమ మద్యం మరియు ఇతర మారణాయుధాల కోసం ప్రతి ఇంటిని, సందులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
పాత నేరస్థులు మరియు అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తుల వివరాలను సేకరించి వారిని విచారించారు.
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై, ముఖ్యంగా గంజాయి విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని గుర్తించడం, వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవడం, ప్రజల్లో భద్రతా భావాన్ని కల్పించడమే ఈ ఆపరేషన్ ప్రధాన ఉద్దేశ్యం అని నిడదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ పివిసి తిలక్ తెలియజేశారు.
