Saturday, April 25, 2026
HomePoliticsAndhra Pradeshపాత పింఛన్ విధానమే అమలు చేయండి ప్రభో

పాత పింఛన్ విధానమే అమలు చేయండి ప్రభో

నాలుగు వాయిదాలోనీ డి ఏ లు మంజూరు చేయాలి

సరెండర్ లీవుల బిల్లులు మంజూరు చేయండి

సుదీర్ఘ కాలంగా పాఠశాల బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల సమస్యలను మానవతా దృక్పథం సమాలోచనచేసి నేటి వరకు వాయిదా వేస్తూ వస్తున్న అంశాలను ప్రభుత్వ పాలకులు తక్షణమే అమలు చేయాలని శ్రీకాకుళం జిల్లా బహుజన టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సీర రమేష్ బాబు డిమాండ్ చేశారు.

ప్రభుత్వము 12వ పి.ఆర్.సి కమిషన్ను వెంటనే నియమించి 30% మధ్యంతర భృతిని చెల్లించాలన్నారు,

నేటి వరకు చెల్లించాల్సిన నాలుగు డిఏలను మంజూరు చేసి, నాలుగు సంవత్సరాలు పెండింగ్ లో ఉన్న సరెండర్ లీవుల బిల్లులను సత్వరమే చెల్లించాలన్నారు, ఉద్యోగ, ఉపాధ్యాయ లకు ఇప్పటివరకు చెల్లించాల్సిన 34 వేల కోట్ల బకాయిలను చెల్లించుటకు తగిన రూట్ మ్యాప్ ప్రకటించాలని ప్రభుత్వం చెల్లించాల్సిన ఆర్థిక అంశాలు పైనే వందలాది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి అనే విషయాన్ని ప్రభుత్వం గమనించి సత్వరమే ఉపాధ్యాయులకు అందాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించాలని రమేష్ బాబు డిమాండ్ చేశారు.

నూతన సిపిఎస్ రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని అలాగే 2003 డీఎస్సీ వారికి మెమో నెంబరు 57 ప్రకారం వెంటనే పాత పెన్షన్ అమలు చేయాలని స్పష్టం చేశారు, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులకు ఉన్నత చదువులకు ఉద్దేశించిన జీవో నెంబర్ 342 ప్రకారం అనుమతిని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలోనే ఇవ్వాలన్నారు,

గ్రామీణ ప్రాంతంలో తక్కువ శాతం రోల్ పేరుతో ప్రాథమిక పాఠశాలను మూసేయడం నిలుపు చేయాలన్నారు, 2005 మెగా డీఎస్సీ లో జరిగిన అవకతవకలపై తక్షణమే దర్యాప్తు చేసి పరిష్కారం చేయాలని తెలిపారు, కొత్తగా అప్ గ్రేడ్ అయిన ఉన్నత పాఠశాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు, మెరిట్ కం రోస్టర్ ప్రకారం సీనియారిటీ జాబితా సిద్ధం చేసి పదోన్నతులు కల్పించి, ఆశ్రమ గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలల్లో పదోన్నతులు కల్పించేందుకు తగిన కార్యాచరణ చేయాలన్నారు, ఉద్యోగ, ఉపాధ్యాయు ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వ పాలకులు, ఉన్నతాధికారులు స్పందించి మా సమస్యలు సానుకూలంగా పరిష్కరించాలని మా న్యాయమైన పోరాట డిమాండ్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు 31 మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసనతో కూడిన ధర్నా శాంతియుతంగా నిర్వహిస్తామని, ఈ కార్యక్రమంలో ఉద్యోగ ఉపాధ్యాయ లు భారీగా పాల్గొని ఈ న్యాయ పోరాటాన్ని విజయవంతం చేయాలని బహుజన టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సీర రమేష్ బాబు పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments