Saturday, April 18, 2026
HomeUncategorizedపిజిఆర్ఎస్ అర్జీలను మీ కోసం వెబ్ సైట్ లో కూడ నమోదు చేయవచ్చు-జిల్లా కలెక్టర్ విజయ...

పిజిఆర్ఎస్ అర్జీలను మీ కోసం వెబ్ సైట్ లో కూడ నమోదు చేయవచ్చు-జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్

పిజిఆర్ఎస్ అర్జీలను మీ కోసం వెబ్ సైట్ లో కూడ నమోదు చేయవచ్చు

నేడు కలెక్టరేట్ లో పి జి ఆర్ ఎస్ కార్యక్రమం

జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్

అనకాపల్లి, జయ జయహే: ప్రజా సమస్యల పరిష్కార వేదిక  (పి.జి.ఆర్.ఎస్) లో అర్జీల వివరాలు మీ కోసం వెబ్ సైట్ ద్వారా నమోదు చేయవచ్చని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. గత పి జి ఆర్ ఎస్ లో సమర్పించిన అర్జీల సమాచారం కోసం 1100 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని జిల్లా కలెక్టర్ తెలిపారు . ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో అన్ని మండల, డివిజన్ స్థాయి కార్యాలయాల్లో సోమవారం పి జి ఆర్ ఎస్ కార్యక్రమం నిర్వహించి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని కలెక్టర్ అ ప్రకటన లో తెలిపారు. అర్జీదారులు Meekosam.ap.gov.in(మీకోసం డాట్ ఏపీ డాట్ జివో వి డాట్ ఇన్) వెబ్సైట్ ద్వారా అర్జీలు నమోదు చేసుకోవచ్చని ఆమె పేర్కొన్నారు. అర్జీల నమోదు, నమోదైన అర్జీల స్థితి, దానికి సంబంధించి సమాచారం తెలుసుకొనుటకు 1100 (డబల్ వన్ డబల్ జీరో) కి నేరుగా కాల్ చేయవచ్చని తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments