— డాక్టర్ కందుల నాగరాజు
స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర విజయవంతంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు తెలిపారు.
32వ వార్డు అల్లిపురం మార్కెట్ ప్రాంతంలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమంలో
ఉద్యోగులు, స్థానికులతో ఆయన స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు.
పర్యటించి అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ
ప్రభుత్వ పరంగా చేపట్టిన కార్యక్రమాలపై ప్రజలను చైతన్యవంతులను చేసి వాటిని విజయవంతం చేయడం ద్వారా అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా వాతావరణంలో వచ్చే మార్పులను అధిగమించేందుకు ప్రతీ పౌరుడు సామాజిక బాధ్యతగా మొక్కలను పెంచాల్సిన అవసరం ఉందన్నారు.మానవాళి మనుగడ పచ్చదనం పరిఢవిల్లితేనే సాధ్యమవుతుందన్న విషయాన్ని ప్రతిఒక్కరూ గ్రహించాలన్నారు. అలాగే ప్లాస్టిక్ వాడకం పెనుభూతం లాంటిదని, పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వాడకం నిషేధాన్ని గట్టిగా అమలు చేయకుంటే మన భావితరాలకు పెనుముప్పు తప్పదని హెచ్చరించారు.
సుసంపన్నమైన, ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించిన స్వర్ణాంధ్ర 2047 దార్శనిక పత్రంలోని 10 సూత్రాల్లో సమగ్ర విధానాలతో స్వచ్ఛాంధ్ర అనేది ఒక సూత్రంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి నెలా మూడో శనివారం ఒక ప్రత్యేక థీమ్తో స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో
ఇన్చార్జ్ ఎస్ఐ కీర్తి, సెక్రటరీలు శశిబాల, పవన్, ప్రసాద్, దివ్యశ్రీ, వార్డు మేస్త్రి కనకరాజు తదితరులు పాల్గొన్నారు.
