Home Politics National భక్తుల సేవలో డా. ఆర్‌ఎస్‌ఎస్ రీసెర్చ్ ఫౌండేషన్

భక్తుల సేవలో డా. ఆర్‌ఎస్‌ఎస్ రీసెర్చ్ ఫౌండేషన్

0

పులివెందుల పట్టణంలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయ ప్రాంగణంలో పరిశుభ్రత మరియు భక్తుల సౌకర్యం దృష్ట్యా అవసరమైన పనిముట్లు, త్రాగునీటి డ్రమ్ములను డాక్టర్ ఆర్‌ఎస్‌ఎస్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వితరణగా అందజేశారు.
ఈ సందర్భంగా స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ ఆర్‌ఎస్‌ఎస్ మాట్లాడుతూ, ఆలయ ప్రాంగణంలో పెరిగే పిచ్చి మొక్కలు, గడ్డి మరియు ఇతర వ్యర్థాలను తొలగించేందుకు అవసరమైన వివిధ రకాల పనిముట్లు అందించామని తెలిపారు. అలాగే వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఆలయానికి వచ్చే భక్తుల దాహార్తిని తీర్చేందుకు త్రాగునీటి డ్రమ్ములు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీ రంగనాథ ట్రస్ట్ చైర్మన్ అల్లం రంగనాయకులు, ఆలయ చైర్మన్ సుధీకర్ రెడ్డి, ఈవో వెంకటరమణ, శ్రీ సాయి చైతన్య జూనియర్ మరియు డిగ్రీ కళాశాల అధినేత నారాయణరెడ్డి, గుప్త మెడికల్ అధినేత దినేష్ కుమార్, ఆలయ ప్రధాన అర్చకులు సోమేపల్లి కృష్ణ రాజేష్ శర్మ, డాక్టర్ ఆర్‌ఎస్‌ఎస్ రీసెర్చ్ ఫౌండేషన్ సభ్యులు సరస్వతి, ప్రణీత్ కుమార్, మొహమ్మద్, సుబ్బరాయుడు మరియు ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version