Saturday, April 18, 2026
HomePoliticsAndhra Pradeshనూకాంబిక అమ్మవారి కలశ స్థాపన పూజా కార్యక్రమంలో పాల్గొన్న పీల గోవింద సత్యనారాయణ

నూకాంబిక అమ్మవారి కలశ స్థాపన పూజా కార్యక్రమంలో పాల్గొన్న పీల గోవింద సత్యనారాయణ

ఉత్తరాంధ్ర ఇలవేల్పు ఆరాధ్య దైవమైన శ్రీ నూకంబిక అమ్మవారి దేవాలయం శనివారం నూతనంగా నిర్మించిన గాలిగోపురం పై ప్రతిష్టించే కలసస్థాపన పూజా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నాయకులు ఏపీ అర్బన్ ఫైనాన్సు అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీల గోవింద సత్యనారాయణ దంపతులు కలసస్థాపన ప్రతిష్ట మహోత్సవ పూజ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది వేద పండితులు రామాచార్యులు రేజేటి చక్రవర్తి ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలో పంచగవ్యము , జలాధివాసము, ధాన్యావాసము క్షీరాభిషేకం,హోమాలు, వేద పారాయణం మొదలగు పూజలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ పూజా కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడం జరిగింది. కార్యక్రమంలో రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర దంపతులు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్
దేవాలయం చైర్మన్ పీల నాగ శ్రీను (గొల్ల బాబు )ఆలయ సహాయ కమిషనర్ వై శ్రీధర్ జిల్లా సహాయ కమిషనర్ కేఎల్ సుధారాణి పాలకవర్గ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments