Saturday, April 18, 2026
HomePoliticsAndhra Pradeshమండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా మహిళ దినోత్సవ వేడుకలు

మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా మహిళ దినోత్సవ వేడుకలు

మాడుగుల మండల పరిషత్ కార్యాలయంలో శనివారం ఎంపీపీ టీవి రాజారామ్ అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల ప్రత్యేక అధికారి బి శివప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎండిఓ వ్యాపారం తహసిల్దార్ కి రమాదేవి డిప్యూటీ ఎండిఓ గౌరీశంకర్ ఆర్డబ్ల్యూఎస్ ఏఈ మల్లేశ్వరి ఎంపీటీసీలు సర్పంచులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా దినోత్సవ ప్రాముఖ్యత ప్రస్తుతం మహిళలు పాత్ర భవిష్యత్తులో అనుసరించాల్సిన విధి విధానాలు, బాధ్యతలు ఆర్థిక భరోసా విద్య ఉద్యోగం వంటి అనేక అంశాలపై ఎంపీపీ, తహసిల్దార్, ప్రత్యేక అధికారి తో పాటు పలువురు వ్యక్తులు ప్రసంగించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రమాదేవి తో అటు వెలుగు ఏపిఎం రమణి కుమారి, మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు పి విజయలక్ష్మి, ఎంపీటీసీలు కే మహేశ్వరి, షేక్ ఉనీషా, గ్రామ సర్పంచ్లు ఎడ్ల కళావతి, చారుమతి తో పాటు పలువురు మహిళా ఎంపీటీసీలను సర్పంచ్లను, మహిళా ఉద్యోగులను సాలువులతో సత్కరించి, జ్ఞాపికలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments