వైయస్సార్సీపి క్రిస్టియన్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు రెవ విజయ సారథి ఆధ్వర్యంలో పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల ప్రధమ వర్ధంతి కొంతమూరు లో ఘనంగా నిర్వహించారు . ముఖ్య అతిథులుగా రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షులు బొల్లవరపు జాన్ వెస్లీ, వైయస్సార్సీపి జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కే జాన్ వెస్లీ రాష్ట్ర కార్యదర్శి రెవ. ఎం శ్రవణ్ కుమార్, ఉప కార్యదర్శి రెవ. వై రాజా, తూర్పుగోదావరి జిల్లా ఏడు నియోజకవర్గాల అధ్యక్షులు మండల కమిటీ సభ్యులు, జిల్లా క్రైస్తవ సేవకులు నాయకులు పాల్గొన్నారు
ఈ సందర్బంగా రాష్ట్ర అధ్యక్షులు జాన్ వెస్లీ మాట్లాడుతూ కూటమీ ప్రభుత్వంలో క్రైస్తవులకు రక్షణ కరువైందని సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంతర్జాతీయ సువార్తికుడు ప్రపంచవ్యాప్త క్రైస్తవ వేదాంత తత్వవేత్త పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణాన్ని చాలా చులకనగా తీసుకున్నారని ఆయన మాట్లాడిన మాటల ద్వారానే అర్థమైందని చెప్పారు. ప్రవీణ్ పగడాల తమ సందేశాల ద్వారా ఎంతోమంది క్రైస్తవ యువతను ఉత్తేజితం చేశారని ఆయన యొక్క ఆశయాలను సిద్ధాంతాలను ఆయన లేకపోయినా మనందరం ఆచరించవలసిన అవసరం ఉందని తెలియజేశారు.క్రైస్తవుల పట్ల దళితుల పట్ల పేదవారిపట్ల ప్రేమ లేకుండా క్రైస్తవులకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి క్రైస్తవుడు అనేవాడు ఈ ఆంధ్ర రాష్ట్రంలో బ్రతకకూడదని కంకణం కట్టుకున్నట్లుగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని సభను ఉద్దేశించి మాట్లాడారు. ఇంతవరకు ఒక్క క్రైస్తవుడిని కూడా నామినేటెడ్ పదవులలో ఈ ప్రభుత్వం నియమించలేదని దీనిని బట్టి క్రైస్తవుల సమస్యల పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అర్థమవుతుందని తెలియజేశారు.
వైయస్సార్సీపి జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం క్రైస్తవులను అనగదొక్కాలని క్రైస్తవత్వంలో అధిక శాతం ఉన్నటువంటి దళితులను వారి కుటుంబాలను, ఇండ్లను ఖాళీ చేయించి రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా ఉందనిపిస్తోంది ఈ మధ్యకాలంలో రాజమండ్రి పట్టణంలో ఆదిరెడ్డి అప్పారావు వైయస్సార్సీపీ ద్వారా ఎమ్మెల్సీగా గెలిచి పార్టీని విడిచిపెట్టి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయి దళితుల ఓట్లతో తన కుమారుడు ప్రస్తుత ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గెలిచిన విషయాన్ని విస్మరించి వాడ దాటిన తర్వాత బోడి మల్లయ్య అనే సామెత లాగా దళిత జాతికి చెందిన జాన్ అనే వ్యక్తి నీ చంపేస్తానని సభ్య సమాజం సిగ్గుపడే రీతిగా దుర్భాషలాడుతూ ఏ కుటుంబం అయితే ఈ జాన్ సహకారాన్ని అందుకున్నారో ఆ కుటుంబ యజమానురాలైన స్త్రీని భయభ్రాంతులకు గురిచేస్తూ తన కుమారుడు ఉద్యోగాన్ని తనకి ప్రభుత్వం లో ఉన్న పరపతిని బట్టి తీయించేస్తానని బెదిరిస్తూ ఒక చదువు లేని సంస్కారం లేని వ్యక్తుల మాట్లాడుతున్నారని ఆరోపించారు.
ఈ సభకు కన్వీనర్ గా జిల్లా అధ్యక్షులు రెవ. మారేళ్లపూడి విజయసారథి, జిల్లాఅధ్యక్షులు, జిల్లా సేవకులు, నాయకులు వ్యవహారించి పాస్టర్ ప్రవీణ్ ప్రగడాలకు ఘన నివాళులర్పించారు
పాస్టర్ ప్రవీణ్ పగడాల ప్రధమ వర్ధంతి సభ
RELATED ARTICLES
