కొత్తూరు పంచాయతీ శారద కాలనీలో శ్రీ విఘ్నేశ్వర స్వామి 43 వ వార్షికోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళా సురేంద్ర పాల్గొని స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ కమిటీ సభ్యులు శాలువ తో సత్కరించి ప్రసాదం అందజేశారు, అనంతరం భారీ అన్నసమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా మల్ల సురేంద్ర మాట్లాడుతూ ప్రజలు అందరకి స్వామి వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని,ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న కమిటీ వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో కోన శ్రీను,సతీష్,మరపురెడ్డి సత్యనారాయణ,పీడీ ప్రసాద్,యండపల్లి శేఖర్,ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
