Home Politics Andhra Pradesh ఘనంగా జాతీయ విజ్ఞాన దినోత్సవం”

ఘనంగా జాతీయ విజ్ఞాన దినోత్సవం”

0

అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం 42వ డివిజన్, కామాక్షినగర్, అయ్యన్నపేట జంక్షన్ మున్సిపల్ నడక మైదానంలో ‘జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని’ క్లబ్ అధ్యక్షుడు సి.హెచ్.రమణ అధ్యక్షతన నిర్వహించారు.
ముందుగా క్లబ్ సభ్యులంతా నడక మైదానంలో గణిత శాస్త్ర పితమహుడు, సర్ సి.వి. రామన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ముఖ్యఅతిధిలుగా హాజరైన డిస్ట్రిక్ట్-102 గవర్నర్ ఎ. తిరుపతి రావు, ప్రముఖ సాహితీవేత్త, మాజీ రాష్ట్ర ఎస్టీ సెల్ చైర్మన్ డాక్టర్ డి.వి.జి శంకరరావు మాట్లాడుతూ మనిషిని చీకట్లో నుంచి వెలుగులోకి తీసుకెళ్ళే సాధనమే విజ్ఞానమని, సర్ సి.వి. రామన్ భారతదేశం గర్వించదగ్గ గొప్ప భౌతిక శాస్త్రవేత్త అని, రామన్ ఎఫెక్ట్ ను కనిపెట్టారని, ఆయన పరిశోధన ఫలితాన్ని ధృవీకరించిన 1928, ఫిబ్రవరి 28న జాతీయ విజ్ఞాన దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించిందని, ఇంత గొప్ప శాస్త్రవేత్తను నోబుల్ బహుమతి, భారత రత్న వంటి గొప్పగొప్ప పురస్కారాలు అందుకున్న మహనీయడు సర్ సి.వి.రామన్ అని ఆయన గొప్పతనాన్ని కొనియాడారు.
కార్యక్రమంలో డిప్యుటీ గవర్నర్ తాడ్డి ఆదినారాయణ, అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ వ్యవస్థాపక గౌరవ అధ్యక్షులు త్యాడ రామకృష్ణారావు(బాలు), జాలీ వాకర్ వై. నలమహారాజు, క్లబ్ ఉపాధ్యక్షులు పెనుమత్స అప్పలరాజు, జి. సూర్యప్రకాశరావు ఎస్సై, క్లబ్ కార్యదర్శి కోట్ల ఈశ్వరరావు,జాయింట్ కార్యదర్శి ఇందుకూరి అప్పలరాజు,క్లబ్ పెద్దలు పొడుగు రాంబాబు,కోట్ల సత్యనారాయణ,పాత్రుడు,నరేష్,ప్రసాద్,ఆదినారాయణ పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version