Thursday, April 23, 2026
HomeNewsఘనంగా పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ కార్యక్రమం

ఘనంగా పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ కార్యక్రమం

చినముసిడివాడ గౌరి సంక్షేమi సంఘం భవనం లో 95, 97 వార్డు బిజెపి మండల అధ్యక్షులు చిక్కాల సతీష్ ఆధ్వర్యంలో ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి వందేమాతరం గీతంతో ప్రశక్షణ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా అనకాపల్లి జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి కె. సురేంద్రమోహన్, పెందుర్తి నియోజకవర్గం ప్రశిక్షణ కన్వీనర్ చొక్కాకుల వెంకటరావు, 95 వార్డు కార్పొరేటర్ ముమ్మన దేముడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ బిజెపి పార్టీ స్థాపించినప్పటినుండి ఇప్పటివరకు జరిగిన సంఘటనలను వివరించారు. రాష్ట్ర కార్యదర్శి సురేంద్రమోహన్ మాట్లాడుతూ ఈ ప్రశిక్షణ 8 కాలాంశాలతో కూడుకొని ఉంటుంది. మూడు సంవత్సరాలకు ఈ ప్రశక్షణ జరుగుతుంది అలాగే కొత్తగా పార్టీ లోకి వచ్చినటువంటి వారందరికీ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు, పార్టీ విధానం తెలియాల్సిన అవసరం ఉందని తెలిపారు. పెందుర్తి నియోజకవర్గం ప్రశిక్షణ మహా అభియాన్ కన్వీనర్ చొక్కాకుల వెంకటరావు మాట్లాడుతూ ఈ ప్రశిక్షణ ద్వారా కార్యకర్తలు బిజెపి సిద్ధాంతాలను అవగతం చేసుకొని ప్రజలకు వివరించి పార్టీ ని బలోపేతం చేయాలని ప్రతి ఒక్క కార్యకర్త నాయకులకు చూచించారు. స్థానిక కార్పొరేటర్ ముమ్మన దేముడు అందరూ శ్రద్ధగా 8 కాల అంశాలను గ్రహించి నోట్స్ తీసుకొని ఈ ప్రశిక్షణ ను ఉపయోగించుకొని పార్టీ అభివృద్ధికి పాటుపడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పి బాలసుబ్రమణ్యం బిజెపి శక్తి కేంద్ర ప్రముఖులు, కార్యవర్గ సభ్యులు, మండల పదాధికారులు, మహిళలు తో పాటు 120 మంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments