Thursday, April 23, 2026
HomeNewsరామాలయ విగ్రహ ప్రతిష్టాపనలో గంటా

రామాలయ విగ్రహ ప్రతిష్టాపనలో గంటా

మండలంలోని శిర్లపాలెం గ్రామంలో సోమవారం జరిగిన శ్రీ కోదండ సీతారామ లక్ష్మణస్వామి విగ్రహ ప్రతిష్ఠకు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. శనివారం విష్వక్సేన పూజతో ప్రారంభమైన ప్రతిష్టాపన ఉత్సవాలు విగ్రహ, పంచలోహ కలశ ప్రతిష్టతో ముగిశాయి. ఆలయ అభివృద్ధికి అన్ని విధాలుగా అండగా ఉంటానని ఈ సందర్భంగా గంటా చెప్పారు. విగ్రహ ప్రతిష్ట పురస్కరించుకుని అన్నసమారాధన, ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో శిర్లపాలెం సర్పంచ్ శిర్ల అప్పలనాయుడు, కూటమి నాయకులు చిక్కాల విజయ్ బాబు, తాట్రాజు అప్పారావు, బి.ఆర్.బి. నాయుడు, శివాజీ, సూరాల సత్య వరప్రసాద్, ఎర్ర రాజు, లొడగల వెంకట్రావు, కాళ్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments