Home News మన ఊరు మన జెండా స్థూపం

మన ఊరు మన జెండా స్థూపం

0

తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని రంగా వెంకటేశ్వరరావు కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది.
ఈ సందర్భంగా రంగా వెంకటేశ్వరరావు తన సొంత నిధులతో “మన ఊరు – మన జెండా” స్తూపాన్ని ఏర్పాటు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నియోజకవర్గం నలుమూలల నుంచి నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
సామాజిక సేవలో భాగంగా రంగా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సుమారు 200 మంది పేద మహిళలు, పురుషులకు దుప్పట్లు పంపిణీ చేశారు. అదేవిధంగా వృద్ధులు, మహిళలకు ఫ్రూట్స్, అల్పాహారం అందజేశారు.
ఈ కార్యక్రమంలో సింహాద్రి సత్యనారాయణ, ప్రమోద్ కుమార్, అక్కిన గోపాలకృష్ణ, రంగినీడి గంగాధర్, బూరుగుపల్లి శివరామకృష్ణ, లక్కోజు సాయి, కంటిపూడి శ్రీరామ్ మూర్తి, శ్రీనివాస్, గున్నబత్తుల మూర్తి, బాబీ, రేలంగి వెంకటేశ్వరరావు, తమ్మిరెడ్డి నాగేశ్వరరావు, దేవన వెంకట పాపారావు, ఎస్ మట్లా వెంకట దుర్గారావు, తోరం జయ శ్రీనివాస్, ముదునూరి వెంకట కిషోర్ రాజు తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version