Home Politics Andhra Pradesh కొయ్యూరు పోలీస్ స్టేషన్‌లో పాఠశాల విద్యార్థుల కోసం ఓపెన్ హౌస్..

కొయ్యూరు పోలీస్ స్టేషన్‌లో పాఠశాల విద్యార్థుల కోసం ఓపెన్ హౌస్..

0

మహిళా సాధికారత వారోత్సవాల సందర్భంగా కొయ్యూరు పోలీస్ స్టేషన్‌లో పాఠశాల విద్యార్థుల కోసం ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులను పోలీస్ స్టేషన్‌కు ఆహ్వానించి, పోలీస్ స్టేషన్ పనితీరు, పోలీసుల బాధ్యతలు మరియు ప్రజల సమస్యలను ఎలా పరిష్కరిస్తారో వివరంగా తెలిపారు.
అదేవిధంగా పోలీసులు ఉపయోగించే ఆయుధాలు, కమ్యూనికేషన్ పరికరాలు మరియు వాహనాల గురించి విద్యార్థులకు చూపించి వాటి వినియోగంపై అవగాహన కల్పించారు. పోలీస్ శాఖ ప్రజల భద్రత కోసం ఎలా పనిచేస్తుందో కూడా వివరించారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు మహిళల భద్రత, సైబర్ నేరాలపై అవగాహన, అత్యవసర పరిస్థితుల్లో పోలీసులను ఎలా సంప్రదించాలో తెలియజేయడం జరిగింది. అలాగే విద్యార్థులు చదువులో రాణిస్తూ భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే మంచి పౌరులుగా ఎదగాలని, పోలీస్ శాఖలో చేరి దేశ సేవ చేయాలని ప్రోత్సహించారు.
ఈ కార్యక్రమంలో కొయ్యూరు సిఐ శ్రీనివాస్ మరియు కొయ్యూరు
ఎస్ఐ కిషోర్ వర్మ పాల్గొని విద్యార్థులకు మార్గదర్శనం చేశారు. పోలీస్ సిబ్బంది మరియు పాఠశాల ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version