రూ. 12లక్షలు విలువైన 9తులాల బంగారం స్వాదీనం
కోనసీమ జిల్లాకు చెందిన పాత నేరస్తుడు చోరీ సొత్తుతో అనకాపల్లి రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా తిరుగుతూ ఉండగా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం శివకోడు పాలెం గ్రామానికి చెందిన ఎల్లమెల్లి వెంకటరమణ, అలియాస్ కిషోర్ సన్నాఫ్ అర్జున్ రావు పాత నేరస్థుడుగా గుర్తించారు. 2025 డిసెంబర్ నెలలో అనకాపల్లి కర్నాల వీధిలో ఇల్లు అద్దెకి కావాలని తాను సచివాలయ ఉద్యోగునిగా పరిచయం చేసుకున్నాడు. నీకు పెన్షన్ ఇప్పిస్తానని చెప్పి, నీ ఫోటో తీయాలని, ఫింగర్ ప్రింట్ కావాలని ఆ మహిళను నమ్మించాడు. మెడలో బంగారు వస్తువులు ఉంటే పెన్షన్ రాదని నమ్మబలికి ఆమె మెడలో ఉన్న పుస్తెలతాడును మెడలోంచి బయటికి తీయించి, లోపటికి వెళ్లి నీవు చేతులు తుడుచుకునేందుకు వస్త్రాన్ని తీసుకురమ్మని చెప్పి ఆమెను లోపలికి పంపించి ఆమె తీసి పెట్టిన నగలును వెంకటరమణ (కిషోర్) పట్టుకొని పరారయ్యడు. ఈ సంఘటనపైఅప్పట్లో అనకాపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసారు. ఈ మధ్యనే ఎస్ రాయవరం మండలం కొరుపోలు గ్రామంలో ఇదే విధంగా అక్కడ కూడా చోరీకి పాల్పడ్డాడు. ఇతనిపై పలు పోలీస్ స్టేషన్లో 42 కేసులు ఉన్నాయని, పాత నేరస్థుడని ఇతను చోరీ చేసిన సొత్తును అమ్ముకొని జల్సాలు చేస్తుంటాడని, ఇతని వద్ద నుంచి తొమ్మిది తులాల రెండు పుస్తెలతాడులను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. దీని విలువ సుమారు రూ. 12 లక్షలు ఉంటుందన్నారు. ఈ దొంగ ఎక్కువగా రైల్వే స్టేషన్, పెద్దపెద్ద ప్రభుత్వ ఆస్పత్రులు, స్మశానలు, విశాఖపట్నం ఎంవీపీ కాలనీలలో ఆవాసం చేసుకొని సంచరించే చుట్టుపక్కల వంటరి మహిళలను టార్గెట్ చేసి వారి ఇళ్లల్లోకి సచివాలయ ఉద్యోగిని అని నమ్మించి చోరీ చేస్తూ ఉంటాడని అనకాపల్లి డీఎస్పీ శ్రావణి మీడియా సమావేశంలో తెలిపారు. ఈ మేరకు పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి న్యాయస్థానానికి హాజరు పరిచారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ సీ ఐ, ఎస్ ఐ, పోలీస్లు ఎం సముద్రం, ఆర్ పి నాయుడు, టీఎస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
