అల్లూరి జిల్లా కొయ్యురు లో ఈ రోజు
అంగన్వాడీ వర్కర్స్, ఆశ,సిహెచ్ డబ్ల్యు, మిడ్డే మీల్స్, తదితర కార్మికులు దేశవ్యాప్తసమ్మె లో పాల్గొన్నారు.
సమ్మె సందర్బంగా ర్యాలీ అనంతరం సభ జరిగింది.
సీఐటీయూ నాయకులు సూరిబాబు మాట్లాడుతూ కార్మికులకు నష్టదాయకమైన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కేంద్రంలో బిజెపి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని
దుయ్యబట్టారు. ఇప్పటికే లేబర్ కోడ్లను అమలు చేయడం వలన కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉన్నాయని కార్మికులకు సమ్మె ధర్నాల లో మాట్లాడే హక్కు కోల్పోయారని లేబర్ కూడా అమలు చేయడం వలన కార్మిక వర్గాన్ని మరింత దోచుకోవడానికి అవకాశం ఉన్నదని అన్నారు. లేబర్ కోడ్లను వెంటనే రద్దు చెయ్యాలని డిమాండ్ చేశారు.
అలాగే స్కీం వర్కర్లైన అంగన్వాడి,ఆశ,సిహెచ్ డబ్ల్యు, మిద్దె మీల్స్, కాంట్రాక్ట్ ఔట్సోర్సెస్ ఉద్యోగులు చేత వెట్టిచాకిరి చేయించి తక్కువ వేతనాలు ఇస్తున్నారని అన్నారు. కనీస వేతనాలు అమలు చేయడం లేదని సమాన పనికి సమానం వేతనం ఇవ్వడం లేదని సుప్రీంకోర్టు ఇంటర్నేషనల్ లేబర్ కోర్టు ఆర్థిక కమిటీ ఆదేశాలు ఉన్నప్పటికీ కనీస వేతనాలు అమలు చేయకపోవడం చాలా దుర్మార్గమని విమర్శించారు. స్కీము వర్కులందరికీ కనీస వేతనాలు 26,000 ఇవ్వాలని జీతములో సగం రిటైర్మెంట్ కి పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్ని స్కీం వర్కర్లకి అమలు చేయాలని సిహెచ్ డబ్బు లను ఆశా వర్కర్లుగా మార్చాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు తులబడ ప్రసాద్, బొంజన్న, అంగన్వాడీ లీడర్స్ అచ్చియమ్మ. ముత్యాలమ్మ, అన్నపూర్ణ మనీ ఆశా అచ్చియ్యమ్మ తదితరులు పాల్గొన్నారు
సిఐటియు ఆధ్వర్యంలో దేశవ్యాప్తసమ్మె..
RELATED ARTICLES
