సీఎం చంద్రబాబును కోరిన ఎమ్మెల్యేలు, కేంద్రానికి లేఖ రాయాలని విజ్ఞప్తి
సానుకూలంగా స్పందించిన సీఎం,ప్రపంచ స్థాయి క్రీడాకారులను సిద్ధం చేసేందుకు అవసరమైన జాతీయ క్రీడా సంస్థ ను విశాఖ లో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ను విశాఖ ఎమ్మెల్యే లు కోరారు. ఈ మేరకు శుక్రవారం అసెంబ్లీ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ప్రభుత్వ విప్ గణబాబు, తూర్పు శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబులు కలిశారు. విశాఖలో భారత ప్రభుత్వ సహకారంతో జాతీయ క్రీడా సంస్థ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేంద్రం ఎన్ ఐ ఎస్ సెంటర్ ద్వారా యువతకు ప్రపంచ స్థాయి శిక్షణ, కోచింగ్, క్రీడా విజ్ఞాన సదుపాయాలు లభించి క్రీడా ప్రతిభ అభివృద్ధి చెందుతుందన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ యువతకు మాత్రమే కాకుండా దేశ క్రీడాభివృద్ధికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. విశాఖపట్నంలో ఎన్ ఐ ఎస్ కేంద్రం స్థాపనకు భారత ప్రభుత్వానికి ముఖ్యమంత్రి సిఫార్సు చేయాలని కోరారు. విశాఖపట్నంలో రానున్న మెట్రో రైల్ ప్రాజెక్ట్స్ మౌలిక సదుపాయాలపై సలహాలు నివేదిస్తూ చర్చించడం జరిగినది.
విశాఖ లో జాతీయ క్రీడా సంస్థ
RELATED ARTICLES
