Saturday, April 18, 2026
HomePoliticsAndhra Pradeshప్రజాభిప్రాయమా తూ తూ మంత్రమా

ప్రజాభిప్రాయమా తూ తూ మంత్రమా

 

గ్రానైట్ యాజమాన్యాలకు అను వుగా సదస్సులు

ఈ క్వారీల తో స్థానిక అభివృద్ధి సున్నా

టెక్కలి ఫిబ్రవరి జయ జయహే

శ్రీకాకుళం జిల్లాలో అతి ప్రాముఖ్యం ఆర్థిక లాభాల వ్యాపారాలు ప్రకృతి సోయగాలైన తూర్పు కనుమల సంపద గ్రానైట్ క్వారీల తవ్వకాల వల్ల పర్యావరణానికి ప్రమాదమే తప్ప స్థానికుల ఎలాంటి ఉపయోగం లేదని అందరికీ తెలిసిన విషయమే ఏళ్ల తరబడి గ్రానైట్ వ్యాపారాలు రాజకీయ నాయకుల కళ్ళ ఎదుట జరుగుతున్నప్పటికీ అక్కడ ప్రజలకు ధూళి దుమ్ము అనారోగ్యాలు కలుషిత గాలులు తప్ప ఈ క్వారీల వల్ల ఎలాంటి ప్రయోజనాలు లేవని స్థానిక యువకులు , ప్రజలు వెలుగెత్తి చాటుతున్నారు.

ఇటీవల టెక్కలి మండలంలోని అంజనాపురం గ్రామ సరిహద్దులో ఎమ్మెస్ మౌంటైన్ గ్రానైట్ కంపెనీ తవ్వకాల అనుమతుల కోసం టెక్కలి ఆర్డిఓ సమక్షంలో ప్రజాభిప్రాయ సేకరణ కోసం సదస్సు నిర్వహించారు, స్థానికులకు అన్ని మౌలిక సదుపాయాలు అభివృద్ధి పనులు సత్వరమే నిర్వహిస్తామని సదస్సులో ఆర్డీవో ఎం కృష్ణమూర్తి హామీ ఇచ్చారు, 15 ఏళ్లగా ఇక్కడ క్వారీ నిర్వహిస్తున్నప్పటికీ ఏ ఒక్కరికి ఎలాంటి ఉపయోగం లేదని స్థానికులు ఆర్డీవోకు విన్నవించారు, గ్రానైట్ యాజమాన్యాలు, ప్రభుత్వ అధికారులు హామీలు ఇచ్చి మర్చిపోవడం తప్ప స్థానికంగా కనీస మౌలిక సదుపాయాలైన మంచినీరు, రహదారులు, నిరుద్యోగ సమస్య తీరేలా ఏది కార్యాచరణ జరగడంలేదని ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేశారు, స్థానికంగా పనిచేయని స్వచ్ఛంద సంస్థల మాయ జాలముతో, కొంతమంది స్వార్థ పరులు, దళారీలతో మమ అనిపిస్తూ అభిప్రాయ సేకరణ పూర్తి చేయడం తగదని దీనిపై స్థానికులతో సమగ్రమైన దర్యాప్తులు చేసి ప్రజాభిప్రాయ సేకరణ తో అనుమతులు మంజూరు చేయాలని సిపిఎం జిల్లా నాయకులు నంబూరు షణ్ముఖరావు, స్థానిక ప్రజలు డిమాండ్ చేశారు. ఈ తూ తూ మంత్ర ప్రజా సదస్సులో అధికారులతో పాటు ఆంజనేయ పురం, రామకృష్ణాపురం, వెంకటాపురం, నువ్వు గుడ్డి గ్రామాలనుంచి కొంతమంది ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments