Wednesday, May 6, 2026
HomePoliticsAndhra Pradeshనిడదవోలు పట్టణ బీసీ సంఘం అధ్యక్షుడిగా నానాపరపు మార్కండేయులు నియామకం

నిడదవోలు పట్టణ బీసీ సంఘం అధ్యక్షుడిగా నానాపరపు మార్కండేయులు నియామకం

ఆర్. కృష్ణయ్య నాయకత్వంలో కొనసాగుతున్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో, రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షులు ముద్దాడ గణేష్ భవాని ఆదేశాల మేరకు నిడదవోలు పట్టణ బీసీ సంఘం అధ్యక్షుడిగా నానాపరపు మార్కండేయులు గారిని నియమించినట్లు వెల్లడించారు. ఈ నియామకాన్ని తూర్పుగోదావరి జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు గంగుల గోపాలకృష్ణ (గోపీ యాదవ్) అధికారికంగా ప్రకటించారు.
బీసీ వర్గాల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తున్న మార్కండేయులు గారిపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించినట్లు గోపీ యాదవ్ తెలిపారు. నిడదవోలు పట్టణంలో బీసీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మార్కండేయులు మాట్లాడుతూ, తనపై ఉంచిన విశ్వాసానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, బీసీ సంఘం బలోపేతం, అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తానని, నాయకుల మార్గదర్శకత్వంలో ముందుకు సాగుతానని అన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments