ఉత్తరాంధ్ర జిల్లాలో అరాధ్య దైవం ఈ ప్రాంత ఇలవేల్పు శ్రీ మాడుగుల మోదుగ అమ్మవారి తీర్థ మహోత్సవము మార్చి 10వ తేదీన నిర్వహించనున్నట్టు ఆలయ కమిటీ అధ్యక్షుడు పుప్పాల అప్పలరాజు శనివారం తెలిపారు. ఈ మేరకు ఆలయ ప్రాంగణంలో జరిగిన పాలకవర్గ సమావేశం నిర్ణయం తీసుకుందని చెప్పారు. కాబట్టి ఈ ప్రాంత ప్రజలు అమ్మవారి భక్తులు తీర్థ మహోత్సవానికి హాజరై అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందాలని విజ్ఞప్తి చేశారు. తీర్థానికి సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభిస్తున్నట్టు ఆయన అన్నారు. ఈ సమావేశంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు పి అప్పలరాజు, కమిటీ సభ్యులు డి సూర్యరావు, శ్రీనివాసరావు, బిహెచ్ పైడి నాయుడు ఇతర సభ్యులు పాల్గొన్నారు.
మార్చి 10న మాడుగుల మోదమ్మ తీర్థ మహోత్సవం
RELATED ARTICLES
