ముంచంగిపుట్టు, జయ జయహే : మండలంలో గల పలు పాఠశాలలను ఆదివారం ఎంపీడీవో కె.ధర్మారావు సందర్శించి పరిశీలించారు. ఏనుగురాయి పంచాయతీ బొండాపుట్టులో కర్రల పాకలో నిర్వహిస్తున్న పాఠశాలను ఎంపీడీవో పరిశీలించారు. అలాగే దాతల సహాయంతో టొంగికోటలో నిర్మించిన పాఠశాల భవనాన్ని చూశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పక్కా భవనాలు లేని పాఠశాలలను గుర్తించి, దాతల సహాయంతో తాత్కాలిక షెడ్లు నిర్మాణం చేపట్టేందుకు తనవంతు కృషి చేస్తానని అన్నారు. విద్యా అభివృద్ధికి అన్ని వర్గాల వారు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శి సింహాచలం ఉన్నారు.
పలు పాఠశాలలను పరిశీలించిన ఎంపీడీవో ధర్మారావు
RELATED ARTICLES
