అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ సీఎం రమేష్ జన్మదిన వేడుకలు బుధవారం మాడుగుల లో బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసే శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్ళు రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర మహిళా మోర్చా ఇంచార్జ్ మండల సంతోషి సుబ్బలక్ష్మి, పార్టీ నాయకులు మెల్లిపాక స్వామి, పుట్ట నాగేంద్ర, మండల ఛాయారాం, కే వెంకటేశ్వరరావు, కర్రీ రాజు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
