Saturday, April 18, 2026
HomeUncategorizedవార్డులలో పర్యటించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

వార్డులలో పర్యటించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

వార్డులలో పర్యటించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

•⁠ ⁠ప్రజలతో మమేకమై సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే*

 

విశాఖపట్నం జయ జయహే దక్షిణ నియోజవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ 30 వ వార్డు మరియు 36వ వార్డులో పరిధిలో ఉన్న పలు ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్థానిక ప్రజలను స్వయంగా కలిసి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు .ప్రజలనుంచి వచ్చిన సమస్యలను సంబందించిన అధికారికి తెలియజేసి వెంటనే పరిష్కరించాలని సూచించారు. పరిష్కారం కానీ సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి పూర్తిచేయాలని అధికారులకు ఆదేశించారు. మంతావారి వీధి, సాలిపేట, రజక వీధి, తాడి వీధి పరిసర ప్రాంతాలలో డ్రైనేజీ, రోడ్లు, మంచినీరు, సుచి శుభ్రత, ప్రజారోగ్యం, వీధి దీపాలు మరియు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఎమ్మెల్యే స్వయంగా ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా వార్డులో జరుగుతున్న అభివృద్ధికి పనులు మరియు వార్డు అభివృద్ధికి సంబంధించిన పనులను స్వయంగా పర్యవేక్షించారు. ఎమ్మెల్యే వార్డు పర్యటనకు రావడంతో ప్రజలు ఎమ్మెల్యే వెంట జాతరలా పర్యటనలో పాల్గొన్నారు. సమస్య ఏదైనా తన దృష్టికి తీసుకురావాలని స్థానిక అధికారులకు మరియు స్థానిక నేతలు తమ దృష్టికి తీసుకోవాలని మరొకసారి తెలిపారు. కార్యక్రమంలో 30 వార్డు ,36 వార్డు కార్పొరేటర్లు, టిడిపి ,జనసేన, బిజెపి అధ్యక్షులు, సీనియర్ నాయకులు , కార్యకర్తలు, ప్రజలు, జనసైనికులు, వీర మహిళలు, గ్రామ పెద్దలు, ఆయా ప్రాంతాల సంఘం పెద్దలు పాల్గొన్నారు…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments