Monday, April 20, 2026
HomePoliticsAndhra Pradeshగ్రామ అభివృద్ధిపై జనసేన రాజుతో సమావేశం

గ్రామ అభివృద్ధిపై జనసేన రాజుతో సమావేశం

చోడవరం నియోజకవర్గ పరిధిలోగల రావికమతం మండలం కొత్తకోట పంచాయతీ అభివృద్ధి పై పంచాయతీ అధికారి జ్యోతీశ్వర రెడ్డి, సచివాలయాల సిబ్బంది.
సోమవారం చోడవరం జనసేన పార్టీ ఇంచార్జ్ పివిఎస్ఎన్ రాజు తో సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా రాజు గ్రామానికి సంబంధించిన పలు విషయాలను సంబంధిత సచివాలయం సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి సంబంధించిన సమస్యలను, ప్రజలకు అందించాల్సిన సేవలు గూర్చి వారికి పలు సూచనలు వారికి ఇచ్చారు.అలాగే సచివాలయ సిబ్బంది నిర్వహిస్తున్న విధులకు సంబంధించిన కార్యకలాపాలను తెలియజేశారు. ముఖ్యంగా త్రాగు నీరు, డ్రైనేజీ గూర్చి కులాంకషంగా చర్చించారు. ఈ సందర్భంగా సిబ్బంది తాము ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలు తెలియచేస్తూ ఈ గ్రామంలో గల మూడు సచివాలయాలకు బిల్డింగ్స్ లేవని అలాగే స్థానికంగా ఉన్న పంచాయతీ భవనం కూడా ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితుల్లో తాము తీవ్ర భయాందోళనలతో సదరు కార్యాలయంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నామని ఈ సమస్య నుండి తమకు ఉపశమనం కలిగించడానికి తక్షణమే గ్రామంలో గల ఏదో ఒక సచివాలయ భవనం లోకి తమను తరలించాలని కోరారు. అలా చేయకపోతే తమ ప్రాణాలకి పెనుముప్పు ఉందని తెలియచేస్తూ వినతి పత్రాన్ని రాజుకు అందజేశారు. దీనికి స్పందించిన రాజు ఈ విషయాన్ని తక్షణమే జిల్లా పంచాయతీ అధికారి కి, జిల్లా కలెక్టర్ కి తెలియచేస్తానని , పూర్తి వివరాలు తో కూడిన నివేదికను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి పంపిస్తానన్నారు. ఈ సమావేశంలో చోడవరం మార్కెట్ కమిటీ డైరెక్టర్ దాసరి చిన్నబ్బాయి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి లొట్ల శివ, కార్యదర్శి కోన రమణ, గ్రామ పార్టీ అధ్యక్షులు చింతల కిషోర్, పార్టీ నాయకులు గట్రేడ్డి సాయినాథ్,మోహన్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments