Sunday, April 19, 2026
HomePoliticsAndhra Pradeshఏపీలో ఏ ప్లస్ కేటగిరీలో మాడుగుల నియోజకవర్గo

ఏపీలో ఏ ప్లస్ కేటగిరీలో మాడుగుల నియోజకవర్గo

రాష్ట్రంలో వివిధ అంశాల్లో 175 నియోజకవర్గాలకు ప్రభుత్వం ర్యాంకులు ప్రకటించింది. వివిధ ఇండికేటర్లను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ ర్యాంకులు వేసింది. మొత్తం 175 నియోజకవర్గాల్లో ఏ ప్లస్‌లో 21 నియోజకవర్గాలు ఉండగా ఏ గ్రేడ్‌లో 153 నియోజకవర్గాలు, బీ గ్రేడ్‌లో ఒక నియోజకవర్గం ఉండగా, 90 శాతం పైగా మార్కులతో ఏ ప్లస్‌ గ్రేడ్‌ సాధించిన 13 నియోజకవర్గాలలో మాడుగుల కూడా చోటు చేసుకుంది. 93 మార్కులతో నంబర్‌ వన్‌గా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నిలబడింది. అలాగే 92 మార్కులతో గాజువాక రెండో ర్యాంక్‌ సాధించగా, 3వ ర్యాంక్‌ కాకినాడ నగర నియోజకవర్గం, 4వ ర్యాంక్‌ విజయవాడ తూర్పు నియోజకవర్గం స్థానం పొందాయి. ఏ ప్లస్ కేటగిరిలో అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గo 132 ఇండికేటర్స్ తో, 91 మార్కులు స్కోరు సాధించింది. స్థానిక ఎమ్మెల్యే బందర్ సత్యనారాయణ మూర్తి పనితీరు ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments