Monday, June 1, 2026
HomePoliticsAndhra Pradeshమార్కాపురం జిల్లాకు కాటమరాజు పేరు పెట్టాలి

మార్కాపురం జిల్లాకు కాటమరాజు పేరు పెట్టాలి

యాదవ్ సంఘాల డిమాండ్

మార్కాపురం కేంద్రంగా ఏర్పడబోయే కొత్త జిల్లాకు “కాటమరాజు జిల్లా”గా పేరు ప్రకటించాలని యాదవ్ జేఏసీ జిల్లా యూత్ ప్రెసిడెంట్ సుధాకర్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటనలో మాట్లాడుతూ, కాటమరాజు పేరు దక్షిణాది రాష్ట్రాల తెలుగు యాదవుల వారసత్వానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు జిల్లాలకు చారిత్రక మహనీయుల పేర్లు నామకరణం చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అందులో భాగంగా ఎన్.టి.ఆర్. జిల్లా, వైయస్సార్ జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, అన్నమయ్య జిల్లా వంటి జిల్లాలకు ప్రముఖుల పేర్లు పెట్టినట్లు తెలిపారు.
అదే విధంగా మార్కాపురం కేంద్రంగా ఏర్పడనున్న జిల్లాకు కాటమరాజు పేరు ప్రకటించే వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపట్టేందుకు యాదవ్ సంఘాలు సిద్ధంగా ఉన్నాయని సుధాకర్ యాదవ్ స్పష్టం చేశారు. యాదవుల ఆత్మగౌరవానికి చిహ్నంగా కాటమరాజు పేరును నిలబెట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments