వడ్డాది కొత్తూరులో పద్భనాభ రామచంద్ర మూర్తి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.బ్రహ్మశ్రీ పాకల కామేశ్వర రావు ఆధ్వర్యంలో ఆలయం వద్ద వేద పండితులతో హోమాదికాలు, పూజలు నిర్వహిస్తున్నారు.2వరోజు శుక్రవారం క్షీరాధివాసం,విశేష సూర్య నమస్కారాలు, హోమాలు నిర్వహించారు. సింహాచలం వేద పాఠశాల విద్యార్థులచే వేదపారాయణం నిర్వహించారు.కంకణం ధరించిన దంపతులుచే హోమాలు నిర్వహించారు.జై శ్రీరామ్ నినాదాలతో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది.శనివారం విజయగణపతి, సీతారాములు,మహాలక్ష్మి దేవి విగ్రహాలు ఆవిష్కరణ, ధ్వజస్తంభ ప్రతిష్ట, రామాలయం ప్రారంభోత్సవం నిర్వహించనున్నారు.అనంతరం కళ్యాణం నిర్వహిస్తారు.ఆలయ ప్రతిష్టా మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు.
ఘనంగా రామాలయ ప్రతిష్టామహోత్సవాలు
RELATED ARTICLES
