Thursday, June 4, 2026
HomePoliticsAndhra Pradeshఅనకాపల్లి ఉత్సవ ను జయప్రదం చేయండి

అనకాపల్లి ఉత్సవ ను జయప్రదం చేయండి

అనకాపల్లి జిల్లా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా అనకాపల్లి జిల్లాలో ఈనెల 30 31 తేదీల్లో నిర్వహిస్తున్న అనకాపల్లి ఉత్సవం కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని ఎంపీపీ టి వి రాజారామ్, ఎండి ఒ కే అప్పారావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం మాడుగుల మండల పరిషత్ కార్యాలయంలో సచివాలయ సిబ్బంది, వివోఏ లు అంగన్వాడి కార్యకర్తలతో అవగాహన సమావేశం ఎంపీ అధ్యక్షతన నిర్వహించారు. అనంతరం ఎండిఓ కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి బస్టాండ్ లో మనవహరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎండిఓ ఎంపీపీ మాట్లాడుతూ ఈ ఉత్సవం లో భాగంగా అనకాపల్లి లో కొండకర్ల అవా, బొజ్జన్న కొండ, బెల్లం మార్కెట్, ముత్యాలమ్మ బీచ్ వంటి పలు ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేశారని, సినీ గాయకులచే సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. కాబట్టి ఉద్యోగులతో పాటు ప్రజా ప్రతినిధులు, ప్రజలంతా ఈ ఉత్సవాలు జయప్రదం చేసి అనకాపల్లికి పేరు తేవాలని కోరారు. ముఖ్యంగా ఉద్యోగులు ఈనెల 31న ఓడీతో కూడిన సెలవు తీసుకుని హాజరు కావాలన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments