హాజరైన స్పీకర్, ఎంపీ, ఎమ్మెల్యే
చోడవరం నియోజకవర్గ పరిధిలో గల రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ కళ్యాణపులోవలో ఆదివారం మహాశివరాత్రి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే కె ఎస్ ఎన్ రాజు చొరవతో ముందుగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభాధిపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు,రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సి.ఎం రమేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.కార్యక్రమంలో చోడవరం శాసనసభ్యులు కే.ఎస్.ఎన్.ఎస్ రాజు,అనకాపల్లి జిల్లా టీడీపీ అధ్యక్షులు రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు ,డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజ స్థానిక ప్రజాప్రతినిధులు,కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.ముందుగా రిజర్వాయర్ వద్ద ఏర్పాటు చేసిన స్నానఘట్టానికి ప్రజా ప్రతినిధులు చేరుకుని గంగమ్మ వారికి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.అనంతరం కల్యాణపులోవలో కొలువుదీరిన పోతురాజుబాబు పెద్దింటమ్మ వారిని దర్శించుకున్నారు.తదనంతరం శివాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.వేద పండితుల ఆశీర్వచనం స్వీకరించిన అనంతరం వేలాదిమంది భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని స్వయంగా వడ్డించారు.ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు ,ఎంపీ సి.ఎం రమేష్ భక్తులకు అభివాదం చేస్తూ ప్రత్యేకంగా మహిళలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.ఆధ్యాత్మికతతో సమాజంలో ఐక్యత శాంతి నెలకొనాలని ఈ సందర్బంగా నాయకులు ఆకాంక్షించారు. ఎటువంటి అమాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు తగు భద్రత చర్యలు చేపట్టారు. భక్తులు సౌకర్యం ఆర్టిసి వారు ప్రత్యేక బస్సులు నిర్వహించారు. వివిధ స్వచ్ఛంద సంఘాల వారు భక్తులకు సహాయ కార్యక్రమాలు చేపట్టారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ ఉత్సవలు నిర్వహించారు.
