Saturday, April 25, 2026
HomePoliticsAndhra Pradeshసమస్యలు పరిష్కారానికే ఆదివాసీ సంఘాలు దీక్ష

సమస్యలు పరిష్కారానికే ఆదివాసీ సంఘాలు దీక్ష

ఆదివాసి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఆదివారం ఆదివాసీ సంఘాల ప్రతినిధులు విశాఖలో దీక్షలు చేపట్టారు.స్టీల్ ప్లాంట్ 100 శాతం ప్రైవేటీకరకు వ్యతిరేకరణ వద్దని,
వైజాగ్ పోర్ట్ హాస్పిటల్ ప్రైవేటికరణ చేయవద్దని,
ఎల్ఐసి లో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కు వ్యతిరేకంగా పోరాడుదాం అంటూ పిలుపునిచ్చారు.
అలాగే ఆదివాసీ చట్టాలు, హక్కులను పరిరక్షించుకుందామనీ,
జి ఓ నెం.3 పునరుద్ధరణ చెయ్యాలనీ,
గిరిజన ప్రాంతాల్లో 1/70 చట్టాలు అమలు చెయ్యాలనీ కోరుతున్నారు. ఈ మేరకు విశాఖ జీవీఎంసీ ఎదురుగా ఉదయం 10 నుంచి 12 గంటల వరకు నిరసన దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో
విశాఖ జిల్లా కార్మిక, ప్రజాసంఘాల జేఏసీ, సిఐటియు జిల్లా కార్య వర్గ సభ్యులు పి మణి ముఖ్య వక్త గా పాల్గొన్నారు.అఖిలభారత గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోరాబు సత్యనారాయణ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రైవేటీకరణ విధానాలు దళిత, గిరిజన బలహీన వర్గాల జీవనోపాధికి తీవ్ర ఆటంకంగా నిలిచాయి. ప్రైవేటు రంగం కన్నా బాగా పనిచేసి చూపిస్తామని కార్మిక వర్గం అంటున్నా ఆ అవకాశాలు విశాఖ స్టీల్ ప్లాంట్ కు కావాలనే ఇవ్వకుండా, నష్టాలు వస్తున్నాయనే నెపంతో ప్రైవేటు వారికి ఇవ్వడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలు,సంస్థల తోనే విశాఖపట్నం జిల్లా అభివృద్ధిలో అగ్రభాగాన ఉన్నది. ఎన్నికలకు ముందు ఒక మాట ఎన్నికల, తరువాత ఒక మాటతో కూటమి నాయకులు అధికారంలోకి వచ్చిన తరువాత స్టీల్ ప్లాంట్ ను పట్టించుకోకుండా, ఇంకా ఎలాంటి పనులు ప్రారంభం కాని నక్కపల్లి లో నిర్మించే ప్రైవేటు ఉక్కు కర్మాగారానికి ఇనుప ఖనిజగనులు కేటాయించమని మన పార్లమెంట్ సభ్యులు కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నారంటే, ప్రైవేటీకరణ మీద ఎంత ప్రేమ ఒలకబోస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
స్టీల్ ప్లాంట్ ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ అధ్యక్షులు బొండా తౌడన్న మాట్లాడుతూ మరో ప్రక్క పెర్మనెంట్ ఉద్యోగాలను విఆర్ఎస్ పేరుతో ఊడబీకుతున్నారన్నారు. ఒకప్పుడు18 వేలు ఉన్న స్టీల్ ప్లాంట్ 9,300 మంది ఉంటే మరల ఇంకో 720 మందిని వీఆర్ఎస్కు పంపే పనిలో ఉందన్నారు.18 వేలమంది ఉద్యోగులు ఉన్న విశాఖ పోర్ట్ నేడు 2600 మంది తో సరిపెడు తున్నారు. 27 బెర్త్ లు పోర్ట్ 20 బెర్తులు ప్రైవేటు వారికి ఇచ్చారన్నారు. విశాఖ లోని ప్రతి ప్రభుత్వ రంగ పరిశ్రమలోనూ ఇదే పరిస్తితి నెలకుoది అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల తరపున అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొరాబు సత్యనారాయణ , ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ అధ్యక్షులు స్టీల్ ప్లాంట్ *బి తౌడన్న,* అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం విశాఖపట్నం జిల్లా ప్రధాన కార్యదర్శి కటారి శోభన్ కుమార్,గిరిజన సంఘం అధ్యక్షుడు కిముడు చిన్నం నాయుడు, ప్రధాన కార్యదర్శి జి వి ఆర్ మూర్తి, ఏపీ ఈపీడీసీఎల్ గిరిజన ఉద్యోగుల సంఘం కార్యదర్శి మురల ప్రసాద్, వివిధ ప్రభుత్వ పరిశ్రమల ఉద్యోగులు, గిరిజన సంఘాల జిల్లా సభ్యులు స్వాబి దామోదర్, ఎం గౌరీ శంకర్, సీసా శోభన్ , దేపూరు జయప్రకాష్ , సి హెచ్ కోటిబాబు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments