Monday, April 20, 2026
HomeDevotionalఘనంగా ఎం కోడూరు మోదము తీర్థ మహోత్సవం

ఘనంగా ఎం కోడూరు మోదము తీర్థ మహోత్సవం

ఈ ప్రాంత ఇలవేల్పు శ్రీ మోదకొండమ్మ వారి తీర్థ మహోత్సవము ఆదివారం మాడుగుల మండలం ఏం కోడూరు గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులతో పాటు చుట్టుపక్కల గ్రామాలకి చెందిన అనేకమంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని మోక్కులు చెల్లించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, ఎంపీపీ రాజారామ్, మాజీ ఎంపీపీ వి రామధర్మజ, గ్రామ సర్పంచ్ గొల్లవిల్లి సంజీవరావు, మాడుగుల సొసైటీ మాజీ అధ్యక్షులు పి వెంకట్రావు, ఎం కోడూరు సొసైటీ మాజీ అధ్యక్షులు పి అప్పలనాయుడు, ఎంపీటీసీ ముమ్మిన రమణబాబు తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో వివిధ సంస్కృతి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments