Saturday, April 18, 2026
HomeUncategorizedనీకులాన్ని ప్రేమించు.. ఎదుటి కులాలని అభిమానించు-ఎమ్మెల్యే రోషన్

నీకులాన్ని ప్రేమించు.. ఎదుటి కులాలని అభిమానించు-ఎమ్మెల్యే రోషన్

నీకులాన్ని ప్రేమించు.. ఎదుటి కులాలని అభిమానించు
దేవతిలకుల సంఘం కార్తీక సమారాధనలో ఎమ్మెల్యే రోషన్
జంగారెడ్డిగూడెం, జయ జయహే.

కులాభిమానం తప్పని సరిగా ప్రతివారికీ ఉండాలని మన కులాన్ని ప్రేమిస్తూ ఎదుట కులాలను అభిమానించాలని స్థానిక ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ అన్నారు.ఇక్కడి ఆలపాటి కళ్యాణమండపంలో ఆదివారం దేవతీల కుల సంక్షేమసంఘం ఆధ్వర్యంలో కార్తీక వాన సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా హాజరై న ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎపుడూ ప్రజా సంక్షేమానికి తాను కృషి చేస్తానని సంఘానికి ఎలాంటి అవసరం ఉన్నా తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు, అన్ని కులాలను గౌరవిస్తూనే ఆర్థిక, సామాజిక, పరిస్థితి అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఏడాదికి ఒకసారి సంఘీయులంతా ఒకచోట కలుసుకొని కష్టసుఖాలు పాలు పంచుకొని ఆనందంగా గడపడమే కార్తీక వన సమారాధన ముఖ్య లక్ష్యం అన్నారు.ఎప్పుడూ కలిసి మెలిసి అందరూ ఒక యూనిటీ గా ఉండి రాజకీయాలకు అతీతంగా సంఘంలో ఎవరికైనా కష్టం వస్తే అందరూ ఏకమై ఆకుటుంబానికి బాసటగా నిలవాలని అన్నారు.మన కులాన్ని ప్రేమించి, ఎదుట కులాన్ని గౌరవించాలని అన్నారు.సంఘ పెద్దలు మాట్లాడుతూ తమ సంఘ సభ్యుల అభివృద్ధికి ప్రభుత్వం తరపున సహాయం అందేలా ముఖ్యమంత్రి దృష్టి కి తీసుకువెళ్లాలని కోరారు.. ఈకార్యక్రమంలో పెనుమర్తి రామకుమార్,సీనియర్ నాయకులు పరిమి సత్యనారాయణ, రామాంజనేయులు,మాణికల నాగేశ్వరరావు,మరియూ కూటమి నాయకులు,సంఘ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments